బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం బయటకు వెళ్లే అవకాశం, ఎలాంటి కార్యక్రమాలు లేకపోయినా సోనమ్‌ అందంగా రెడీ అవుతున్న ఓ పిక్‌ను షేర్ చేసింది. ఈ పిక్‌తో పాటు `కేవలం నాల ఇంట్లోని ఇతర రూమ్స్‌ను ఇంప్రెస్‌ చేయడానికే ఇలా రెడీ అవుతున్నా` అంటూ కామెంట్ చేసింది.

 

గత నెలలో సోనమ్ కపూర్ లండన్‌లోని తన ఇంటి నుంచి ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి భర్తతో కలిసి వచ్చింది. ప్రస్తుతం అక్కడే ఆమె సెల్ఫ్‌ క్వారెంటైన్‌లో ఉంటుంది. ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటున్న సోనమ్ తన రోజువారి కార్యక్రమాలను అభిమానులతో పంచుకుంటుంది. అదే సమయంలో ఎన్నో త్రో బ్యాక్ పిక్చర్స్ ను కూడా షేర్ చేస్తోంది సోనమ్. అదే సమయంలోని ముంబైలోని తన కుటుంబ సభ్యులను ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పింది.

 

గత వారం ఆమె తన చిన్నతనంలో కజిన్స్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో సోనమ్ తో పాటు అర్జున్‌ కపూర్‌, అక్షయ్‌ మార్వా, మోహిత్ మార్వాలు ఉన్నారు. ఈ ఫోటోతో పాటు మిమ్మల్ని మిస్‌ అవుతున్నా అంటూ కామెంట్ చేసింది సోనమ్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I miss you all.. ☹️

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి: