కరోనా వైరస్ నేపథ్యంలో క్రైసిస్ చారిటీ విరాళాల కోసం అడుగుతున్న సంగతి తెలిసిన విషయమే. అయితే మధ్య హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ చారిటీ కోసం మూడు లక్షలను విరాళంగా ఇచ్చారు. అయితే ఇది వరకు ఒక్క రోజుకి పారితోషకం తీసుకున్న స్టార్ కమెడియన్ వందల కోట్లు ఉన్న ఆయన కేవలం మూడు లక్షల విరాళం ఇవ్వడమేంటి అంటూ విమర్శల పర్వాన్ని అందుకున్నారు. నిజానికి ప్రస్తుతం అయిన సినిమాలు చేయక పోవచ్చు కానీ సినిమా వల్ల ఆయన ఎంత లాభపడ్డారు ఎంత ఎత్తుకు ఎదిగారు అని తెలుసుకోవాలి అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదే కోవకి ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఎదుర్కొంటోంది.

 


తాజాగా ఈ మధ్య కాజల్ అగర్వాల్ కూడా కరోనా క్రైసిస్ చారిటీకి 2 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. కాజల్ తీసుకున్న పారితోషికం ముందు ఆమె ఇచ్చిన విరాళం నవ్వు తెప్పించే విధంగా ఉందని చాలామంది కామెంట్ చేశారు. అయితే కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్లు తీసుకుంటుంది. ఇది టాలీవుడ్ లో ఏ హీరోయిన్ తీసుకొని అంత పెద్ద మొత్తం. ఇలాంటి ఆవిడ కేవలం రెండు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అది కూడా చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి ఒత్తిడి చేస్తే ఆమె ఇచ్చిందని విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.

 


కాకపోతే కాజల్ అగర్వాల్ కి ఈ మధ్య కాస్త క్రేజ్ తగ్గిందని చెప్పవచ్చు. కాకపోతే ఇంతవరకు చేసిన సినిమాల్లో ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ బట్టి చూస్తే ఆమె ఇచ్చిన రెండు లక్షలు చాలా తక్కువ అని నెటిజన్లు మాట్లాడుతున్నారు. అలాగే నయనతార పాతిక లక్షల విరాళం ఇచ్చినట్టు ఈ విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ కాజల్ నయన్ ని చూసి నేర్చుకో అన్నట్లు చెబుతున్నారు. అయితే కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు లక్షలు విరాళం కూడా ఇవ్వని వాళ్లు చాలామంది ఉన్నారు అంటూ ఏంటి పరిస్థితి అంటూ వారిని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: