ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్ డోన్ విధానాన్ని అమలు పరుస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనికి నిరంతరం డాక్టర్లు, పోలీసులు, మునిసిపల్ కార్మికులు, కరెంట్ ఆపరేటర్లు ఇలా కొద్ది మంది నిరంతరం వారి సేవలు మనం వినియోగించుకుంటున్నం. నిజంగా వీరి యొక్క కృషి ఫలితం వల్ల భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు.

 


ఇక అసలు విషయానికి వస్తే... టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్న దిల్ రాజు మనందరి కోసం పాటుపడే వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారని ఆయన వారిని కొనియాడారు. అలాగే ఆయన పోలీసులు గొప్పతనాన్ని వివరిస్తూ వారి కోసం నేను ఒక సినిమా తీయాలని చాలా రోజులనుంచి అనుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

 


ఇక కరోనా నేపథ్యంలో ఆ ఆలోచన ఇంకా పెరిగిందని కథ కూడా సిద్ధమైందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆయన మెహదీపట్నంలో ఉన్న పోలీస్ సిబ్బందికి సానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. మనం అందరూ స్టేట్ హోమ్ అని ఇళ్లలో ఉంటే పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది వారి సేవలు నిరంతరం కొనసాగిస్తున్నారని వారికి అభినందనలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. అలాగే ప్రజలకు ఆయన లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే కనుక సామాజిక దూరం పాటించి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పశ్చిమ మండలం డిసిపి ఏఆర్‌ శ్రీనివాస్, ఆసిఫ్ నగర్ ఏసిపి ఆర్జీ శివ మారుతి ఇంకా ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏది ఏమైనా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్క పౌరుడు సంజాయిక దూరం పాటిస్తే కరోనని పూర్తిగా నిర్ములించ వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: