సుమారు వంద సంవత్సరాల క్రితం మనదేశం బ్రిటీష్ వారి పాలనలో దాస్యంలోనే మగ్గిపోతుంది.. అప్పటికే అంటే 1885 లో ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం కూడా సరిగ్గా జరగలేదు.. విదేశీయులు అంటే అయిష్టత ఉన్న ఆ రోజుల్లో ఓ నలబై సంవత్సరాల వ్యక్తి.. 1910 డిసెంబరు 25 సాయంత్రం "అమెరికా... ఇండియా సినిమా" లో "లైఫ్ ఆఫ్ క్రీస్ట్" సినిమాను చూశాడు. ఆ సినిమా చూసిన తర్వాత అతనిలో అంతర్మధనం మొదలైంది.. ఇలాంటి సినిమాను మన భారతీయులు ఎందుకు తీయలేరు.. అంత సత్తా మనలో లేదా అని తనలో తాను ప్రశ్నించుకున్నారట.. అలా  రెండు నెలల పాటు ధియేటర్లలో కూర్చుని, "మనం ఈ విధంగా చేయలేమా అనే ఆలోచనలోనే మునిగి పోయాడట.. చివరికి తానే ఈ చిత్ర నిర్మాణం చేయాలని సంకల్పించి అడుగు ముందుకు వేసాడు..

 

 

అప్పటికే ఇతనికి నలభై ఏళ్ళ వయసు వచ్చినా స్థిరమైన ఆదాయం లేదు. స్థిరాస్థులు లేవు. భవిష్యత్తు అభద్రతతో, నిశీధితోనూ ఉంది. ఉన్న కొద్దిపాటి డబ్బును మూట కట్టాడు. చిత్రీకరణకు సంబంధించి పరికరాల జాబితాలు, పుస్తకాలు ఇతర వస్తు సముదాయం అంతా పోగు చేయడం ప్రారంభించాడు. అలా ఎంతో శ్రమకోర్చి 1913 లో ఒక చిత్రాన్ని నిర్మించాడు.. అదే రాజా హరిశ్చంద్ర.. ఈ చిత్రం ప్రారంభ సమయంలో ఎంతగానో నటీనటుల సమస్య ఎదురైంది. ఎందుకంటే నటించడమే అతి హేయమైన, నీచ కార్యంగా భావించిన ఆ రోజుల్లో నటీమణులకోసం వేశ్యా వాటికలకు తెగ తిరిగాడు. ఆఖరుకు ఒక హోటల్ కార్మికుడి చేత సాలుంకి హరిశ్చంద్రుని భార్య తారామి (చంద్రమతి) పాత్రను పోషింపచేసారు..

 

 

ఇంతకు ఇలా ఎన్నో అష్టకష్టాలు పడి ఈ చిత్రాన్ని తెరకెక్కించింది ఎవరనుకుంటున్నారు.. ఆయనపేరే ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే.. ఇప్పుడందరు ఆయన జ్ఞాపకంగా దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో అవార్డులు పెట్టి పిలుచుకుంటున్నారు.. ఇలా ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఊపిరిపోసుకుంది.. భారతీయ మొదటి సినిమా తెరకెక్కింది.. ఇందులోనే ఒక యువకుడు మొట్టమొదటిసారిగా హీరోయిన్‌గా వేషం ధరించాడు....

మరింత సమాచారం తెలుసుకోండి: