కథలు మనదగ్గరకు రాకపోతే మనమే కథల దగ్గరకు వెళ్లాలి. టోల్ గేట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటుకుంటూ స్టోరీ సెర్చింగ్ చేయాలి. అంతకీ దొరక్కపోతే విదేశాలని టచ్ చేయాలి. అప్పుడు ఏదో ఒక సూపర్ హిట్ సినిమా దొరుకుతుంది. దాన్ని రీమేక్ చేసుకోవచ్చని సినీ జనాలంతా చెబుతారు. సమంత కూడా ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. రీమేక్ రాణిగా మారుతోంది. 

 

సమంత పెళ్లి తర్వాత సినిమాల సెలక్షన్ లో చాలా సెలక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉందంటే కాల్షీట్స్ ఇస్తోంది. లేకపోతే నో చెబుతోంది. ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లోనే నటిస్తోంది. అయితే లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లు ఎవరూ తీసుకురావట్లేదని ఫీలవుతుందో ఏమో.. ఆమె కథలు వెతుక్కుంటోంది. కన్నడ నుంచి మొదలు పెట్టి కొరియన్ వరకు అన్ని భాషల నుంచి సూపర్ హిట్ స్టోరీస్ తెచ్చుకుంటోంది. 

 

సమంత లాస్ట్ మూవీ ఓ బేబీ. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తర్వాత సామ్ మరో మూవీ అనౌన్స్ చేయలేదు. అయితే ఈ గ్యాప్ లో సమంత ఓ సూపర్ హిట్ స్టోరీ పట్టేసిందట. కన్నడలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న దియా సినిమాను రీమేక్ చేయాలనుకుంటోందట సమంత. 

 

సమంత పెళ్లి తర్వాత నటించిన సినిమాల్లో రంగస్థలం తప్ప మిగతా రెండు రీమేక్ సినిమాలే. కన్నడ నాట మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న యూ టర్న్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేసింది సామ్. తర్వాత కొరియన్ ఫిల్మ్ మిస్ గ్రానీ ని ఓ బేబీగా రీమేక్ చేసింది. 

 

సమంత ఎక్కువగా రీమేక్ కథలపైనే ఆధారపడటం చూస్తోంటే.. ఈమె సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆల్ రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్స్ ని తీసుకుంటే సేఫ్ గా బయటపడవచ్చు. రిలాక్స్డ్ గా బాక్సాఫీస్ బరిలో దిగొచ్చని, అందుకే రీమేక్స్ పై ఆసక్తి చూపిస్తోంది అంటున్నారు సినీ జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: