యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా 300 కోట్ల బడ్జెట్ తో తమిళ, హిందీ భాషలలో “మహావీర్ కర్ణ ” మూవీ రూపొందుతుంది. ఒకప్పుడు భారీ బడ్జెట్ చిటెమ్ అంటే కేవలం నార్త్ నుంచి బాలీవుడ్ లో మాత్రమే తెరకెక్కించేవారు. మన సౌత్ సినిమా లకు అంత పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరు ధైర్యం చేసేవారు కాదు.  ఇటీవల కాలంలో పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. బాహుబలి నార్త్ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది.

 

 

హిందీ భారీ బడ్జెట్ సినిమాలు విఫలమవుతుంటే మన సౌత్ వాళ్ళు మాత్రం దుమ్ము దులుపుతున్నారు. రోబో కూడా దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో రూపొంది అదరగొడుతుంది. ఇక మన తెలుగు నుండి సైరా , సాహూ సినిమాలు భారీ గా రూపుదిద్దుకుంటున్నాయి. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ హీరోకి గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. తాజాగా చియాన్ విక్రమ్ మరో ప్రయోగానికి సిద్దమవుతున్నారు.  

 

ఆర్.ఎస్‌.విమల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.  ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహావీర్ కర్ణ చిత్రం షూటింగ్ నిలిచి పోయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  కర్ణుడి గెటప్ లో ఉన్న విక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విక్రమ్  ‘కోబ్రా’,  మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీస్ లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: