ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాజమౌళి రాజీలేనితత్వం, అల్లు అర్జున్ సెంటిమెంట్ కు ముడిపెడుతూ కొత్తకొత్త డిస్కషన్లు పెడుతున్నారు సినీజనాలు. లాక్ డౌన్ తో జక్కన్న ఆలోచనలు మారుతున్నాయని, దీంతో బన్నీ ముందుకొస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. 

 

రాజమౌళి బడ్జెట్ విషయంలో అయినా కొంచెం తగ్గుతాడేమో గానీ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో నో కాంప్రమైజ్ అంటాడు. దీనికోసం రిలీజ్ డేట్స్ అయినా మార్చేస్తాడేమో గానీ.. అవుట్ విషయంలో తగ్గేది లేదన్నట్టు ఉంటాడు. అందుకో ఈ ఏడాది జులై 31 అని చెప్పిన ట్రిపుల్ ఆర్ ను వచ్చే ఏడాది సంక్రాతికి పోస్ట్ పోన్ చేశాడు. 

 

ట్రిపుల్ ఆర్ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8కి పోస్ట్ పోన్ చేశాడు రాజమౌళి. అయితే ఈ మూవీ యూనిట్ పుణె షెడ్యూల్ కు రెడీ అవుతున్న టైమ్ లో కరోనా ప్రభావం మొదలైంది. లాక్ డౌన్ తో దేశం మొత్తం స్థంభించిపోయింది. ఈ ప్రభావంతో ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ మారిపోయే అవకాశముందని చెబుతున్నారు. 

 

రాజమౌళి గనుక ట్రిపుల్ ఆర్ ను సంక్రాంతి బరిలో దింపకపోతే.. పండగ సంబరాలు చేసుకోవాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ రగ్  అండ్ రస్టిక్ లుక్ తో నటిస్తోన్న పుష్ప సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

 

సుకుమార్ ఆడియన్స్ కు ఫుల్ క్లారిటీగా సినిమాను చూపించాలని ట్రై చేశాడు. ప్రతీ ఫ్రేమ్ క్లారిటీగా ఉండాలని తపిస్తుంటాడు. అయితే ఈ తపన కొంచెం ఎక్కువైతే షూటింగ్ డేట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. జక్కన్న తప్పుకున్నా.. సుక్కు అన్న సంక్రాంతికి రాగలడా.. అనేది బిగ్ క్వశ్చన్ గా మారుతోంది. సుకుమార్ మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఫ్రేమ్ సెలక్షన్ లోనూ సుక్కూది యూనిక్ స్టైల్. ఓ వైపు మాసిజాన్ని చూపిస్తూనే మరోవైపు స్టైల్ కు ప్రాధాన్యతనిస్తుంటాడు. అందుకే రాజమౌళి లాంటి దర్శకులు కూడా సుకుమార్ మేకింగ్ ను ఇష్టపడుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: