ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులకు ఎంతో కీలకమైన రంజాన్ మాసం మరొక వారం రోజుల్లో ప్రారంభం కాబోతోంది. రంజాన్ మాసం ప్రారంభం కాగానే ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మరియు మసీదుల దగ్గర ఉండే హడావిడి వేరేగా ఉంటుంది. తెల్లవారుజామున సూర్యుడు వచ్చిన క్షణం నుండి సాయంత్రం అస్తమించే సమయం వరకు ఉపవాస దీక్షలు చేస్తూ మసీదులో ప్రార్థనలు నిర్వహించుకుంటూ ఇఫ్తార్ విందు స్వీకరించకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతారు.

 

అయితే వీరందరికీ ఇబ్బంది కలిగించేలా ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ తన కోరలు చాచి కూర్చుంది. ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి మార్చి 24 తేదీ తర్వాత దేశంలో సామూహిక ప్రార్థనలు వద్దని.. అన్నీ మతాల ప్రజలకు ఇది వర్తిస్తుందనితెలిపిన విషయం తెలిసిందే. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ గుంపులు గుంపులుగా చేరి ప్రార్థనలు చేస్తూ ఉంటే ప్రాణాల మీదకి వస్తుందని రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్నందున కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి దేశంలోని అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

 

ఇక ఇప్పుడు రంజాన్ పండుగకు సంబంధించి కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదులను మూసి ఉంచాలి అని.. ఎవరికి వారు తమ ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలని చెప్పిన కేంద్రం అన్ని రాష్ట్రాల్లోని మసీదు పెద్దలకు సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు తెలిపింది. అలాగే ఇఫ్తార్ విందులని కూడా తమ కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా చేసుకోవాలని తెలిపారు. అనవసరంగా బయటకి వస్తే మన ఇన్ని రోజులు ఇంట్లో ఉండి కూడా వృధా అవుతుంది అని కాబట్టి అవసరానికి తగ్గట్టు ఇంటి నుండి బయటకి వచ్చి .. ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వ సూచనలని పాటించాలని అయన కోరారు.

 

ఇక రంజాన్ పండుగ మాసంలో ఇలా తమ పవిత్రమైన మసీదులు మూసివేయవలసిన పరిస్థితి రావడం నిజంగా ముస్లిం సోదరులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: