తెలుగులో అయినా తమిళంలో అయినా సరే త్రిష కు మంచి గుర్తింపు ఉంటుంది. ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా సరే మూడు పదుల వయసు దాటినా సరే వన్నె తగ్గని ఆమె అందం చూసి అభిమానులు ఫిదా అయిపోతు ఉంటారు. ఆమెకు తమిళంలో అయితే అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి అని అంటారు. ఇక ఆమె కు గుడి కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. అగ్ర హీరోల తో ఆమె సినిమా అంటే చాలు చాలా మంది ఫాన్స్ పనులు మానుకుని క్యూ కడుతూ ఉంటారు. ఆమె ప్రస్తుతం అక్కడ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పెద్ద హీరోల సినిమాలే. 

 

ఆమె కోసం రేటు ఎంత అయినా సరే ఇవ్వడానికి అక్కడి నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. అయితే ఆమె తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే ఆమె వద్దని అంటుందని టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి సినిమా ఆఫర్ ని ఆమె వద్దని చెప్పి తప్పుకుంది అంటున్నారు టాలీవుడ్ జనం. ఇది ఎంత వరకు నిజం అనేది స్పష్టంగా తెలియకపోయినా ఆమె మాత్రం తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఇక్కడ కొందరు హీరోలతో ఆమెకు గొడవలు అయ్యాయని అక్కడి నుంచి ఆమె సినిమాలు చేయడానికి ముందుకి రావడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

అగ్ర హీరోల సినిమా అయినా సరే నేను చేసేది లేదని ఆమె చెప్పినట్టు టాలీవుడ్ లో టాక్. ఆమె కోసం దర్శక నిర్మాతలు మంచి పాత్రలు ట్రై చేసినా సరే ఆమె మాత్రం చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. అయితే ఆ గొడవలు పెద్ద ఫ్యామిలీ హీరో తో అయ్యాయి అని అంటున్నారు. అందుకే ఆమె చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: