మొన్న సంక్రాంతికి అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ ఇపుడు ‘పుష్ప’ తో వస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ కు తమిళ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకున్నారు. రీసెంట్ గా విజయ్సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిని పుష్ప టీమ్ కూడా ఖండించ లేదు. విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తన పాత్ర నచ్చకపోవడం కాదని తెలుస్తోంది.

 

 

పుష్ప సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేసిన విధానం విజయ్ కు నచ్చిందట. కానీ.. తమిళ్ లో హీరోగా మంచి క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతికి అక్కడ విలన్ గా కనిపించడం ఇష్టం లేదని చెప్పినట్టు సమాచారం. తమిళ్ లో విజయ్ సేతుపతికి మంచి క్రేజ్, ఫ్యాన్స్ ఉంది. దీంతో విజయ్ కు అక్కడ విలన్ గా కనిపించేందుకు కొంచెం ఇబ్బందిగా ఉందని సుకుమార్ కు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తన పాత్ర నచ్చినా ఈ సినిమా నుంచి తప్పుకోవడం తప్పలేదట విజయ్ సేతుపతికి. దీంతో సుకుమార్ కు వేరే ఆప్షన్ లేకే వేరే నటుడి అన్వేషణలో పడ్డాడట.

 

 

పుష్ప పాన్ ఇండియన్ కథ కావడంతో బాలీవుడ్ నటుడ్ని ఈ పాత్రకు తీసుకోవాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియన్ స్కేల్ ఉన్న కథలకు డిమాండ్ ఉంది. టాలీవుడ్ లో ఉన్న ఈ జనరేషన్ లోని ఆరుగురు స్టార్ హీరోల సినిమాలు ఇదే తరహాలో తెరకెక్కించాలనేది దర్శక నిర్మాతల ఆలోచన. ఇలా ఆలోచించే పుష్పను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: