పెదనాన్న క్రిష్ణంరాజు రెబెల్ స్టార్. ఇక వారసుడిగా వచ్చిన ప్రభాస్ యంగ్ రెబెల్ స్టార్. ప్రభాస్ సినీ రంగ ప్రవేశం జరిగి ఇప్పటికి 17 ఏళ్ళు అయింది.  ఆయన రెండు పదులు సినిమాలు చేసి ఉంటాడేమో. కానీ హాలీవుడ్ ని తాకేలా ఇమేజ్ మాత్రం సంపాదించారు.

 

బాహుబలి అంటే ప్రభాస్ గుర్తుకువస్తారు. అయిదేళ్ళ విలువైన కాలాన్ని నమ్మి మరీ రాజమౌళికి అప్పగించిన ప్రభాస్ అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు. బాహుబలి వన్, బాహుబలి టూ మూవీస్ ద్వారా బాలీవుడ్లో జెండా పాతేశారు.

 

టాలీవుడ్లో పాన్ ఇండియా మూవీకి ప్రభాస్ కేరాఫ్ అయ్యారు. ప్రభాస్ మూవీ సాహో తెలుగులో ఫట్ అయినా బాలీవుడ్లో హిట్ అయింది అంటే దానికి ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కారణం. ఇదిలా ఉండగా ప్రభాస్ తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఒకటి ప్రకటించి ఉన్నారు.

 

అది తన పెదనాన్న  క్రిష్ణంరాజు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా చేసిన భక్త కన్నప్ప. ఆ మూవీని రీమేక్ చేసి తాను ఆ పాత్ర చేయాలని ప్రభాస్ ఆలోచన. క్రిష్ణంరాజు  కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అయితే ఆ మూవీని ఇపుడు మంచు ఫ్యామిలీ హీరో విష్ణు టేకప్ చేశాడు.

 

పాన్ ఇండియా మూవీగా దాన్ని తీయాలని విష్ణు చూస్తున్నాడు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా తీసుకుంటున్నాడు. మరి విష్ణు ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేసిన తరువాత ప్రభాస్ కల చెదిరినట్లే. మొత్తం మీద తన ఫ్యామిలీలో మెమొరబుల్ మూవీని తాను చేయలేకపోవడం అంటే అది ప్రభాస్  కి ఎప్పటికీ ఒక లోటేనని చెప్పాలి.

 

ఇక క్రిష్ణంరాజు తన డ్రీం ప్రాజెక్ట్ గా వీరార్జున మూవీని అప్పట్లో ప్రకటించారు. ఇది భారీ పౌరాణిక చిత్రంగా తీయాలని అనుకున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ని ప్రభాస్ టేకప్ చేసి పాన్ ఇండియా మూవీగా తీస్తే సూపర్  హిట్ అవడం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: