పవన్ కళ్యాణ్ అంటేనే రాజకీయం ప్లస్ సినీ జీవితంగా చెప్పుకోవాలి. ఆయన రాజకీయాల్లో ఓ వైపు బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలు కూడా చకచకా చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ టాలీవుడ్లో మళ్ళే ఫుల్  బిజీ అయిపోవాలనుకుంటున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ వకీల్ సాబ్ మూవీలో హీరోయిన్ ఎవరా అన్న సస్పెన్స్ కి ఇపుడు పూర్తిగా తెరపడింది. ఆ మూవీలో పవన్  కి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోందని ఫిల్మ్ మేకర్స్  చెబుతున్నారు. ఇప్పటికి ఈ మూవీ ఎనభై శాతం మూవీ పూర్తి అయిందని, ఇక ఇరవై శాతం మూవీ మాత్రమే ఉందిట.

 

ఆ పార్ట్ తీయాల్సింది కూడా హీరోయిన్ తో ఉన్న సీన్లేట. ఇవన్నీ ఇలా ఉండగానే కరోనా వైరస్ వచ్చి పలకరించింది. దాంతో పవన్ కళ్యాణ్ శ్రుతిలతో సీన్లూ, ఉంటే సాంగ్స్ కూడా తీయాలన్నమాట.  దిల్ రాజు నిర్మాతగా వేణూ శ్రీరామ్ డైరెక్షన్లో ఈ మూవీ రెడీ అవుతోంది.

 


ఈ మూవీలో శ్రుతి నటిస్తోంది అంటే పవన్ తో మూడవ సారి జోడీ కట్టడం అన్న మాట. ఇంతవరకూ పవన్ ఈ విధంగా మరే హీరోయిన్ తో ఇన్ని సార్లు నటించలేదు. గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, ఇపుడు వకీల్ సాబ్ ఇలా పవన్ తో మూడు చేసిన హీరోయిన్ గా శ్రుతి రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. 

 

ఇక దిల్ రాజు కూడా ఈ మూవీ బంపర్ హిట్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. పవన్ రెండేళ్ల గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం.. ఆయన ఇమేజ్ కి సరిపడా కధ వకీల్ సాబ్ లో కుదరడం. పైగా వేణూ శ్రీరాం డీసెంట్  డైరెక్షన్, ఇవన్నీ కలసి సినిమాకు ఫ్రెష్ నెస్ తో పాటు పాజిటివ్ బజ్ ఉండేలా చేస్తాయని దిల్ రాజు కొండంత నమ్మకంతో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: