మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 40% పూర్తయినట్లు ఇటీవల కొరటాల చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ప్రారంభంలో వచ్చిన పుకార్లు మరే సినిమాపై ఇటీవల రాలేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మొదట రామ్ చరణ్ పేరు వినబడిన తర్వాత ఆ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా 40 నిమిషాలపాటు సినిమాలో మహేష్ నటించనున్నట్లు దాని కోసం భారీ పారితోషికం తీసుకున్నట్లు అనేక రూమర్లు అప్పట్లో రావడం అందరికీ తెలిసినదే. అయితే ఎప్పుడైతే లాక్ డౌన్ పెట్టడం జరిగిందో...చిరంజీవి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 

ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ అన్నీ కూడా ఆగిపోవటంతో సోషల్ మీడియాలో చిరంజీవి ఈ వార్త క్లారిటీ ఇచ్చాడు. ముందు నుండి రామ్ చరణ్ ని అనుకున్నామని..మధ్యలో మహేష్ బాబు పేరు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదని చిరంజీవి తన వివరణ ఇవ్వటం జరిగింది. ఇదే టైమ్ లో కొరటాల ఈ విషయం గురించి మాట్లాడుతూ...ఫస్ట్ రామ్ చరణ్ అనుకున్నా, కానీ ఆర్.ఆర్.ఆర్ ఆలస్యమవుతుండడంతో చరణ్ ఆచార్యకు డేట్స్ ఇవ్వడం లేదు. ఈలోగా ఆచార్య వచ్చే ఏడాదికి కానీ విడుదల కాదన్న పుకార్లు మొదలయ్యాయి. నాలో టెన్షన్ మొదలైంది. ఇటీవలే మహేష్ తో మాటల మధ్యలో ఆచార్య గురించి ప్రస్తావించాను.

 

ఇంకా తెలీట్లేదు సార్ అదే టెన్షన్ గా ఉంది అని అంటే.. మీరు మరీ టెన్షన్ పడితే నేనున్నాను అన్నారు. దీంతో ఈ రెండు కారణాలతో మహేష్ బాబు మీద ఈ సినిమాపై పుకార్లు వచ్చినట్లు కొరటాల ఇటీవల క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాకు మహేష్ మధ్య మంచి బౌండింగ్ ఉందనే సినిమా క్యారెక్టర్ గురించి కూడా చెప్పకుండానే ఆయన చేస్తానని చెప్పటం ఇతరులతో పంచుకోవడం వల్ల వేరేలా ప్రోజోక్ట్ అయిందని తెలిపారు. పైగా రామ్ చరణ్ ఫ్రెండ్ మరియు మహేష్ నాకు క్లోజ్ రావటంతో ఈ రెండు కారణాల వల్ల ఆ పుకార్లు మరింత వైరల్ అయినది అన్నట్టు కొరటాల కామెంట్ చేసినట్లు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: