సినీ తారల జీవితం తెరమీదే మెరిసిపోతుంది.. నిజ జీవితంలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే పెళ్లి చేసుకున్నాక విడిపోకుండా చచ్చేదాక కాపురాలు చేసుకునేది.. కాని చాలా మంది తారల విషయంలో ఇలా జరుగదు.. ఒకటి, రెండు, మూడూ.. ఇలా పెళ్లీలు జరుగుతూనే ఉంటాయి.. మరి కొందరైతే పెళ్లికి ఆమడ దూరం ఉంటారు.. కానీ బాయ్ ఫ్రెండ్స్‌ను మాత్రం మారుస్తూనే ఉంటారు.. చివరికి ఎవరో ఒకరు జీవితంలో చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి అతనితో ఉంటారు.. ఇది రంగుల ప్రపంచంలో ఉన్న రంగు రంగు జీవితాల కోణం..

 

 

ఇకపోతే స్వాతి అంటే టక్కున గుర్తుపట్టరు.. కానీ కలర్ స్వాతి అంటే చాలమందికి గుర్తుకు వస్తుంది, సొట్టబుగ్గల స్వాతి అని.. ఆడవారి మాటలకి అర్థాలే వేరులే సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి.. ఆ తర్వాత వచ్చిన అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్ గా పరిచయమయింది. ఇక ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించిన.. స్వాతిగా కంటే కలర్స్ స్వాతిగానే గుర్తింపు దక్కింది. తెలుగుతో పాటు తమిళ, మళయాల చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన స్వాతికి తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ దశలో కార్తికేయ సినిమా తర్వాత, వికాస్ వాసుని పెళ్ళి చేసుకుని సినిమాలకి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు వార్తల్లో కనిపించలేదు. కానీ తాజాగా స్వాతి చేసిన ఒక చిన్న పనివల్ల మళ్లీ వార్తల్లో నిలిచింది. అదేమంటే..

 

 

స్వాతి తన పెళ్ళి ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఏమైందో తెలియదు ఆ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియా నుండి మళ్లీ డిలీట్ చేసింది. ఇలా తన భర్త ఫోటోలే కాదు, తమ పెళ్ళి ఫోటోలు కూడా డిలీట్ చేయడంతో ఇక్కడే కొందరిలో అనుమానపు బీజం పడిందట.. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు తమ భర్తతో విడిపోవాల్సి వస్తే ముందుగా సోషల్ మీడియా ఫోటోలు డిలీట్ చేస్తున్నారు. ఇలాంటి పనిని ఇలియానా, అమలాపాల్ చేశారు. అందుకే స్వాతి చేసిన పనికి కొందరికి అనుమానం కలిగిందట..

 

 

అయితే అధికారికంగా ఏ విషయం తెలియలేదు కాబట్టి.. వారి జీవితం సాఫీగానే సాగుతుందని అనుకోవాలి.. ఇక ఏదైనా పొరబాటు జరిగి ఉంటే మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.. అందుకని అప్పటి వరకు వేచి చూస్తే సరి అని అనుకుంటున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: