ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ త‌న‌కుండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న కెరియ‌ర్ మొదటి నుంచి కూడా ఆయ‌న‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అక్కడ అమ్మయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయమైన పవన్‌కళ్యాణ్ ఆనాటి నుంచి నేటివరకు కూడా ఆయ‌న  నటించిన చిత్రాల్లో చాలా వరకు అన్నీ ఘనవిజయాల‌నే చెప్పాలి. ప‌వ‌న్‌కు ఒక ప్రత్యేకమైన మేనరింజంలతో యువతను చాలా చక్కగా ఆయ‌న ఆకట్టుకుంటారు. పవన్‌కళ్యాణ్ తొలిప్రేమ, బద్రి, ఖుషీ, జల్సా చిత్రాలతో ప్రేక్ష‌కుల‌కు మరింత చేరువయ్యారు. సెప్టెంబర్ 2, 1973లో జన్మించిన పవన్‌కళ్యాణ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేవరకు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు.

 

అలాగే సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న చిరంజీవికి తమ్ముడైన‌ప్ప‌టికీ త‌న‌కంటూ వేరే ప్ర‌త్యేక‌త‌ను ఏర్ప‌రుచుకున్నారు ప‌వ‌న్‌.  ఇలాంటి పవన్‌కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఓసారి పరిశీలిస్తే... ఆవేశంతోపాటు మంచితనం కలగలసిన ఓ మహోన్నత వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం ప్రయత్నించే పట్టుదల కనిపిస్తుంది. అలాగే ఆయ‌న వ్యక్తిగా కూడా చాలా సరదాగా కన్పించినా ఆలోచనల్లో మాత్రం చాలా విఫ‌రెంట్‌గా పెద్ద త‌ర‌హాలో ఉండ‌డ‌మే ఆయ‌న  ప్రత్యేకత. వ్యక్తిగత జీవితంలో కొద్దిపాటి లోటుపాట్లు ఉన్నా నలుగురికీ సాయం చేయాలనే తపన మాత్రం పవన్‌లో మెండుగా కన్పిస్తుంది.

 

అందుకే పేదల గురించి, వారి కష్టాల గురించి మాట్లాడే సమయంలో పవన్‌లో  కాస్త ఆవేశం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంటుంది. పవన్‌లో కన్పించే ఈ లక్షణాలు ఆయన పుట్టినతేదీకి సంబంధించిన రాశి అయిన కన్యారాశి వారందరిలోనూ ఇలాంటి లక్షణాలు చాలా స‌ర్వ‌స‌హ‌జ‌మ‌ట‌. ఈ రాశిలో జన్మించినవారు చాలావరకు ముక్కు సూటిగా ఉంటారు. ఎదుటివారు విమర్శించినా సరే చాలా విషయాల్లో తమకు నచ్చిన విధంగానే ఉండేందుకు ప్రయత్నిస్తారు. అలాగే నాయకత్వం ల‌క్ష‌ణాలు కూడా వీరికి కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి. పదిమందికీ సాయం చేయాలనే ఆలోచన వీరిలో మెండుగా ఉంటుంది. అయితే ఈ లక్షణాలే ఒక్కోసారి వీరిని అనుకోకుండా చిక్కుల్లో కూడా పడేస్తుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: