కరోనా నేపథ్యంలో తెలుగు సినిమా కార్మికులను ఆదుకోవడానికి  ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ కి హీరోయిన్లు కూడా విరాళాలను ఇస్తున్నారు. అందులో భాగంగా మొన్న కాజల్  2లక్షల విరాళం ప్రకటించగా నేడు మిల్కీ బ్యూటీ తమన్నా 3లక్షల విరాళం ఇచ్చింది. మెగా స్టార్ చిరంజీవి అద్వర్యం లో ఏర్పాటైన ఈ చారిటీకి విశేషమైన స్పందన వస్తుంది. ఇప్పటికే స్టార్ హీరోలు నాగార్జున ,రవితేజ ,ఎన్టీఆర్ నుండి  చిన్న హీరోలు సంపూర్ణేష్ బాబు , కార్తికేయ ఇలా అందరు విరాళాలను ప్రకటించారు. 
 
ఇదిలావుంటే తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపిచంద్  సరసన సీటీమార్ లో నటిస్తుంది. సంపత్ నంది డైరెక్షన్ లో కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈచిత్రంలో తమన్నా,జ్వాలా రెడ్డి  పాత్రలో తెలంగాణ టీం కు  కబడ్డీ కోచ్ గా కనిపించనుండగా ఆంధ్రా  కబడ్డీ టీం కు కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు.  వీరితోపాటు సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా అలాగే యువ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
అంతేకాదు మొదటి సారి ఈ సినిమా కోసం తమన్నా తెలంగాణ యాసలో డైలాగులు చెప్పనుంది. యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రం ఈఏడాది ద్వితీయార్ధం లో విడుదలకానుంది. ఇక సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా నటిస్తుండడం ఇది మూడో సారి. ఇంతకుముందు ,రామ్ చరణ్ సరసన  రచ్చ ,మాస్ మహారాజ్ రవితేజ సరసన బెంగాల్ టైగర్ లో నటించగా  ఈరెండు సినిమాలు  విజయం సాధించాయి. మరి  సీటీమార్ తో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందో లేదో  చూడాలి. కాగా సీటీమార్ తరువాత తమన్నా ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా కు సైన్ చేయలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: