‘కలర్స్ స్వాతి’గా తెలుగు ప్రేక్షకులకు సుపరచితురాలైన నటి స్వాతి పలు సినిమాల్లోనూ నటించింది.  రెండేళ్ల క్రితం వికాస్ అనే బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్ సరిగా సాగడం లేదని భర్త నుంచి విడాకులు తీసుకుందని ఇటివల వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఆమె తన ఇన్ స్టా అకౌంట్ నుంచి భర్త వికాస్ ఫొటోలతో పాటు వీరి పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేయడమే ఇందుకు కారణమైంది. దీనిపై తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చింది.

 

 

ఇందుకు హ్యారీపోటర్ లోని ఓ డైలాగ్ ను, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఉపయోగించింది. ‘డాబీ: డాబీకి ఎక్కడ ఉండాలో తెలుసు. ఆ రూమ్ లోకి ఎలా వెళ్లాలో రావాలో తెలుసు. ఆ ప్లేస్ ప్రాముఖ్యత డాబీకి బాగా తెలుసు. హ్యారీపోటర్: ఎందుకు. డాబీ: ఎందుకంటే.. అవసరం వచ్చినప్పుడు కొన్ని అక్కడే ఉంటాయి. అవి ఒక్కోసారి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. వీటికోసం అన్వేషించే వారి కోసం అవి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి’ అని రాసుకుంది. ఈ వీడియోలో 2012 నుంచి తన ఇన్ స్టాలో ఉన్న ఫొటోలను ఆర్కివ్ లో దాచిపెట్టానంటూ స్క్రోల్ చేసి ఆమె పాత ఫొటోలు, వికాస్ తో ఉన్న ఫొటోలను కూడా చూపింది.

 

 

ఈ వీడియోతో తన వైవాహిక బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టైంది. మరి ఇప్పటికైనా స్వాతిపై వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, అష్టా చమ్మా, కార్తికేయ సినిమాల్లో నటించిన స్వాతి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అష్టాచమ్మాలో హీరో మహేశ్ అభిమానిగా స్వాతి చిలిపి నటనను మర్చిపోలేం. తమిళ, మళయాళ సినిమాల్లో కూడా స్వాతి నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: