అల్లు అర్జున్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ అంటే వరుడు సినిమానే. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద అప్పడు భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కాని ఈ సినిమా ఇద్దరికి భారీ షాక్ ఇచ్చింది. అసలు ఎవరూ ఊహించని విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకు కారణం ఈ సినిమాలో ఫస్టాఫ్ అయినంతవరకు హీరోయిన్ ని రివీల్ చేయకపోవడం. ఇదే సినిమాకి అతి పెద్ద మైనస్ అయింది. అదే సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవడానికి కారణం అయింది. 

 

అయితే అదే మళ్ళీ ఇప్పుడు రిపీటవుతుందా అన్న అనుమానాలు ఇండస్ట్రీలో కొంతమందిలో కలుగుతున్నాయట. శర్వానంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమాని ఆపేశారు. ఇక ఇంతకముందే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ ని రివీల్ చేశారు. శ్రీకారం అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ సినిమాతో శర్వానంద్ హిట్ అందుకోబోతున్నాడన్న టాక్ వినిపించింది.

 

శతమానం భవతి లాంటి సక్సస్ ని శర్వానంద్ మళ్ళీ దక్కించుకోబోతున్నాడని ఈ పోస్టర్ రిలీజ్ చేశాక కామెంట్స్ పడ్డాయి. అసలే వరుసగా ఫ్లాప్స్ తో దెబ్బైపోతున్న శర్వానంద్ కి ఈ కామెంట్స్ కాస్త ఊరటనిచ్చాయి. దిల్ రాజు నిర్మాణంలో సమంత తో కలిసి నటించిన జాను కూడా దారుణంగా ఫ్లాపయింది. ఈ సినిమా ఏదో ఒడ్డున పడేస్తుందనుకున్న శర్వానంద్ ని ఇంకా ఊబిలోకి లాగేసింది. అందుకే శ్రీకారం సినిమా మీద ఆశలన్ని పెట్టుకున్నాడు.

 

అయితే ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ ని పడుతున్నాడు. గతంలో అల్లు సినిమాకి జరిగినట్టుగా శర్వానంద్ శ్రీకారం కి జరుగుతుందని అంటున్నారు. అందుకు కారణం ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఇప్పుడిదే మైనస్ అయి శర్వానంద్ కి మళ్ళీ షాకిస్తుందా అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: