పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అతడి రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కరోనా సమస్య లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మే 15న విడుదల అయి ఉండేది. అయితే కరోనాతో షూటింగ్ లకు బ్రేక్ పడటంతో పవన్ అభిమానుల కోరిక నెరవేరడం లేదు. ఈ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యక్తిత్వం గురించి ‘వకీల్ సాబ్’ మూవీ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియ చేసాడు. తాను పవన్ కళ్యాణ్ ను ‘వకీల్ సాబ్’ మూవీ ప్రాజెక్ట్ విషయమై మొదటిగా త్రివిక్రమ్ ఇంట్లో కలిసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

 

త్రివిక్రమ్ ఇంట్లో ఒక సాదా సీదా వ్యక్తిలా చాల సింపుల్ గా ఎటువంటి డాంబికం లేకుండా కూర్చుని ఉన్న పవన్ కళ్యాణ్ ను చూసి మొదట్లో తనకు మాటలు రాలేదని దీనితో పవన్ కల్పించుకుని తనతో ‘మనం ఎప్పుడైనా కలిసామా’ అంటూ మాటలు కలిపిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ వాస్తవానికి తాను పవన్ ను చాల సంవత్సరాల క్రితం ధమ్స్ అప్ యాడ్ లో కలిసినా ఆ విషయాన్ని తాను మరిచిపోతే పవన్ తనకు గుర్తు చేసి తనలోని బెదురును తొలిగించిన విషయాన్ని బయటపెట్టాడు.

 

‘వకీల్ శాబ్’ షూటింగ్ మొదటిరోజున ఉదయం సరిగ్గా 7గంటలకు సెట్ లోకి వచ్చి కేవలం 4 గంటలలో రెండు పెద్ద సీన్స్ ను పూర్తి చేసిన పవన్ స్పీడ్ చూసి తాను ఆశ్చర్యపోయిన విషయాన్ని వివరించాడు. అంతేకాదు ఒక సీన్ కు సంబంధించి పవన్  తన షర్ట్ ను మార్చుకోవడానికి కేరవాన్ లోకి వెళ్ళేబదులు సమయం వృథా అవుతుందని పక్కకు తిరిగి తన షర్ట్ ను మార్చుకున్న పవన్ కమిట్మెంట్ చూసినప్పుడు ఆయన పవర్ స్టార్ ఎందుకు అయ్యాడో తనకు అర్థం అయింది అంటూ పవన్ వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపించాడు.

 

షూటింగ్ గ్యాప్ లో తాను వెంట తెచ్చుకున్న పుస్తకాలు చదువుతూ ఒకసారి సీన్ కు సంబంధించిన పేపరు ఇస్తే చాల రెండవ టేక్ లేకుండా తన సీన్ పూర్తిచేసే పవన్ ఎటువంటి ఆడంబరం లేకుండా ఎదో విషయమై ఆలోచిస్తూ ఎక్కువగా మౌనంగా ఉండే పవన్ తనకు ఒక టాప్ హీరోలా కాకుండా ఒక వేదాంతిల తనకు కనిపించాడు అంటూ వేణు శ్రీరామ్ కామెంట్స్ చేసాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించన షూటింగ్ చాల భాగం పూర్తి చేసుకున్న పరిస్థితుల్లో ఒక్క మేజర్ షెడ్యూల్ జరిగితే చాలు ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది అంటూ పవన్ వీరాభిమానులకు ఈ కరోనా బ్యాడ్ టైలో గుడ్ న్యూస్ ను అందిస్తున్నాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: