పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలిప్రేమ తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమా అంటే ఖుషీ అనే చెప్పుకోవాలి. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన చాలా చిత్రాలు ఖుషీని మించిపోలేకపోయాయి. గబ్బర్ సింగ్ వరకు పవన్ కళ్యాణ్ ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ పడుతుందేమో అని ఎదురుచూశారు.

 

అయితే ఖుషీ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మణిరత్నం సంగీతం అందించిన పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా అన్న పాట ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఒక తెలుగు సినిమాలో పూర్తి  హిందీ మాటలతో కూడిన పాటని పెట్టడం అన్నది కూడా అప్పట్లో సెన్సేషనే. ఖుషీలోని యే మేరా జగాహ్ అనే పాట పూర్తిగా హిందీలోనే ఉంటుంది.

 

హీరో కలకత్తా లో ఉంటాడన్న కారణంగా ఆ పాటని మొత్తం హిందీ మాటలతోనే రాసి సాహసం చేశారు. అయినా ఆ సాహసం సక్సెస్ అయింది. హిందీ రాని తెలుగు వాళ్లు కూడా పాడుకునే పాటలా అయ్యింది. ఇంకా ముఖ్యమైన సీన్లలో నడుము సీన్ కూడా ఒకటి. తెలుగు సినిమాల్లో నడుము సీన్ అనగానే గుర్తొచ్చేది ఖుషీ సినిమా ఒక్కటే. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉంటుంది.

 

 

తెలుగులో వచ్చిన ఏ సినిమాలోనూ నడుము మీద అంతసేపు డిస్కషన్ ఉండదు. ఒక్క ఖుషీ సినిమాలోనే ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అందుకే ఇప్పటికీ నడుము సీన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖుషీ సినిమానే. అయితే ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన ఖుషీ సినిమాకి తెలుగు రీమేక్. తమిళంలో హీరోగా దళపతి విజయ్ నటించగా, హీరోయిన్ గా జ్యోతిక కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: