బాహుబలి సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్నో చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కాయి. బాలీవుడ్ లోనూ బాహుబలికి ధీటుగా సినిమా తీద్దామన్న ఉద్దేశ్యంతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో ఏవీ బాహుబలి మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయాయి. అయితే దక్షిణాది నుండి వచ్చిన ఒక చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే కేజీఎఫ్. కన్నడ పరిశ్రమలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 

 

బంగారం మాఫియా గురించిన కథలో హీరో ఎలివేషన్స్ ని పీక్స్ లో చూపించారు. గత కొన్నేళ్లలో ఒక సినిమాలో అన్ని ఎలివేషన్స్ సీన్స్ ఉండటం అన్నది ఇదే మొదటిసారేమో. కన్నడతో సహా హిందీ, దక్షిణాది భాషల్లో రిలీజైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. దాంతో కేజీఎఫ్ అభిమానులు రెండవ ఛాప్టర్ కోసం ఎదురుచుస్తున్నారు. లాక్డౌన్  కారణంగా కేజీఎఫ్ ౨ చిత్రీకరణ కొన్ని రోజులు వాయిదా పడింది.

 

కేజీఎఫ్ లో గరుడ పాత్ర చనిపోగానే ఆ స్థానం కోసం చూస్తున్న చాలామందిలో అధీరా పాత్ర కూడా ఒకటి. అయితే అధీరా పాత్రని కేజీఎఫ్ లో రివీల్ చేయలేదు. కేజీఎఫ్ ౨ లో అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. అయితే ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ ౨౩వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. 

 

అప్పటిలోగా కేజీఎఫ్ ౨ టీజర్ రిలీజ్ చేయాలని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే చిత్రబృందం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించనుందని తెలుస్తుంది. టీజర్ కోసం మనకి ఎదురుచూపులు తప్పేలా లేవు. కేజీఎఫ్ ౨ రిలీజ్ కి కొని రోజులు ముందు వరకు ఎలాంటి టీజర్ ని రిలీజ్ చేసే ఉద్దేశ్యమే లేదని చెబుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుందంటే డైరెక్ట్ గా ట్రైలర్ నే విడుదల చేస్తారని సమాచారం. దీంతో టీజర్ పై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: