ప్ర‌స్తుతం ఇండియాలో ఉన్న ప‌రిస్థితి చూస్తే ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెర‌చుకునే ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌డం లేదు. ప్ర‌స్తుతం మ‌న దేశంలో కోవిడ్ వృద్ధిరేటు శ‌ర‌వేగంగా ఉంది. రోజుకు స‌గ‌టున 1000కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. కేసుల సంఖ్య 15 వేలు దాటేసింది. ఇక ఇప్ప‌టికే గ‌త నెల‌న్న‌ర రోజులుగా థియేట‌ర్లు మూసివేశారు. అటు ఆగ్ర రాజ్యం అమెరికాలో కూడా థియేట‌ర్లు మూసివేసినా ఇప్పుడు స‌డెన్‌గా అమెరికా ప్రభుత్వం నిర్ణయం కొన్ని నిబంధ‌న‌ల‌తో థియేట‌ర్లు తెరిచేలా ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆలోచిస్తోంద‌ట‌.

 

హాలీవుడ్‌లో ఇప్ప‌టికే కొన్ని కోట్ల‌లో న‌ష్టం వాటిల్లింది. అమెరికాలో ఉన్న నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, పెద్ద థియేట‌ర్ల య‌జ‌మానుల ఒత్తిళ్ల‌తో అమెరికా ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌తో అయినా థియేట‌ర్ల‌ను ఓపెన్ చేసేందుకు అనుమ‌తులు ఇస్తుంద‌ని అంటున్నారు. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే కోవిడ్ వైర‌స్ వ్యాప్తి ఎక్కువుగా ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో థియేట‌ర్లు ఓపెన్ చేసేందుకు అనుమ‌తులు ఇవ్వ‌ర‌నే అంటున్నారు. దేశ జ‌నాభా ఏకంగా 135 కోట్లుగా ఉండ‌డంతో ఒక‌సారి వైర‌స్ వ్యాప్తి జోరందుకుంటే దీనిని కంట్రోల్ చేయ‌డం క‌ష్టం.

 

అందుకే మన దేశంలో థియేటర్స్ ను ఎప్పుడు తెరుస్తారన్నది మాత్రం అంత త్వరగా తేలే యవ్వారంలా కనిపించడం లేదు. ఇక కొన్ని నెల‌ల త‌ర్వాత థియేట‌ర్లు ఓపెన్ చేసినా కేవ‌లం 50 శాతం మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని అంటున్నారు. అదే జ‌రిగితే థియ‌ట‌ర్ల‌కు, సినిమా రంగాల‌కు భారీ న‌ష్టం త‌ప్ప‌దు. ఇక మ‌రో రెండేళ్ల వ‌ర‌కు ఈ రంగం కోలుకోవ‌డం క‌ష్ట‌మే అన్న‌ట్టుగా ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: