టాలీవుడ్ సినీ ప్రపంచంలో చాలామంది వారసులు వచ్చారు. నిజానికి అందులో ఎక్కువగా అబ్బాయిల వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే చాలా తక్కువే. కాకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు దర్శక, నిర్మాతలు, హీరోల కూతుర్లు వెండితెరపై కనిపించారు నిజానికి అది చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే కొందరు టాలీవుడ్ దర్శకుల కుమార్తెలు మాత్రం తండ్రులకి ఏవిధంగా తీసుకోకుండా చిన్నప్పటినుంచే వారి ప్రతిభను చాటుతున్నారు.

 


వాళ్ళు ఎవరు ఇప్పుడు ఒకసారి ఒక లుక్కేద్దాం. ముందుగా క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె విషయానికొస్తే నీలిమ, యుక్త. అయితే గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమా రుద్రమదేవి చిత్రానికి నిర్మాణ పనులు చూసుకొనగా, అతని చిన్న కుమార్తె యుక్త తన ప్రతిభను చదువులో చూపిస్తుంది. ఇటీవలే తను స్కూల్ ఫస్ట్ వచ్చింది అని గుణశేఖర్ అభిమానులతో పంచుకునే విషయం తెలిసిందే. అలాగే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముద్దుల కుమార్తె పవిత్ర సోషల్ మీడియాలో నెటిజన్లకు బాగా ఆకర్షిస్తోంది. నిజానికి ఆమెకు తండ్రి లాగే దర్శకురాలు కావాలనే కోరిక ఉందట దీనికోసం ఆమె ప్రస్తుతం దర్శకత్వానికి సంబంధించిన కోర్సులు చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. మరో డైరెక్టర్ తేజ విషయానికి వస్తే తన కుమార్తె పేరు ఐలా. ఈవిడ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ చేస్తోందట. నిజానికి ఐలా యువతలో చాలా ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట అంట.

 


అలాగే మరో క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య. మహేష్ బాబు కూతురు సితార, వంశీ పైడిపల్లి కుమార్తె ఇద్దరు కలిసి ఇప్పటికే వారు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక టాలీవుడ్ జక్కన్న దర్శకుడు రాజమౌళి కూతురు మయూఖ. ఈ అమ్మాయి బాహుబలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో హాస్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతి ముద్దుల కుమార్తె పేరు అభీష్ట. ఈ అమ్మాయి ఇప్పటికే ప్రతి రోజు పండగే సినిమాలో రాసి కన్నా చెల్లెలిగా నటించింది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న డైరెక్టర్ సుకుమార్. ఈయన కుమార్తె పేరు సుకృతి వేణి. ఈ అమ్మాయి చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఓ పాట పాడి తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: