సక్సెస్ ఫుల్ చిత్రాలు ఎన్నో అందించి హైయెస్ట్ రేంజ్ లో ఉన్న దర్శకుడు పురీ జగన్నాథ్. ఓ నిర్మాతగా , నటుడిగా మరియు దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. అందరి మాదిరిగానే పురీ జగన్నాథ్ లైఫ్ లో కూడా ఒడిదుడుకులు ఉన్నాయ్. పురీ సినిమాలో హీరో క్యారెక్టర్ కి మంచి గుర్తింపు ఉంటుంది. అందరి దర్శకుల కంటే ఓ విలక్షణ మైన విధానం ఉంటుంది. సక్సెస్ ఫుల్ చిత్రాలకు ఆయన్ని కేర్ అఫ్ అడ్రస్ గా చెప్పుకుంటారు. ఈయన సినిమాలో అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఉంటుంది. ఈయన సినిమాలకు మాటలు మరియు స్క్రీన్ ప్లే ఆయనే రాసుకునేవాడు.

 

1966 లో విశాఖ జిల్లాలోని కొత్తపల్లిలో జన్మించాడు. ఈయనకు చిన్నతనం నుండే స్టోరీలు రాయడం బాగా అలవాటు. మరియు పుస్తకాలూ చదివే అలవాటు ఎక్కువగా ఉండేది. పుస్తకాలు చదివి చిన్న చిన్న కథలు రాసి వారి నాన్నగారికి చూపించి ఎలావుందీ అని అడిగేవాడు. వాళ్ళ నాన్నగారికి టూరింగ్ టాకీస్ ఉండేది ఆ టాకీస్ లో ప్రతి సినిమా వదలకుండా చూసేవాడు. మరియు అందులోని పాత్రలగురించి వాళ్ళ నాన్నగారితో చర్చించేవాడు. పూరి గారి తల్లి తండ్రులు ఆయనకి   సినిమా లపై ఉన్న ఆసక్తి ని చూసి యాక్టింగ్ నేర్చుకోమని 20 వేల రూపాయలు ఇచ్చి హైదరాబాద్ పంపారు. హైదరాబాద్  మధు ఫిలిం ఇంస్టిట్యూట్స్లో 6 నెలల డైరెక్షన్ చేశారు. ఆతరువాత డైరెక్టర్ కే మురళి మోహన్ రావు దగ్గర అసిస్టెంట్ దర్శకుని గా చేరారు .

 

ఆ తరువాత కృష్ణ వంశీ మరియు రాంగోపాల్ వర్మ వంటి గొప్ప దర్శకుల దగ్గరకుడా అసిస్టెంట్ గా చేరి దర్శకత్వ మెలకువలు నేర్చు కున్నారు.ఈ క్రమంలోనే రవితేజ పరిచయం అయ్యాడు.  అయితే అప్పుడప్పుడు ఖర్చు లకోసం బుల్లితెర సీరియల్స్ కోసం కథలు రాస్తూవుండేవాడు. పూరి మొదటి సారిగా పవన్ కళ్యాణ్ గారికి సినిమా కథ చెప్పి ఒప్పించి భద్రి సినిమా తీశారు. అప్పట్లో మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్ కొట్టింది. ఆతరువాత ఇడియట్ , పోకిరి , అమ్మానాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలు సక్సెస్ ని తెచ్చిపెట్టాయి. తరువాత 143 మరియు నేనింతే వంటి సినిమాలు నష్టాలను తెచ్చిపెట్టాయి .ఈ క్రమంలోనే తానునమ్ముకున్నవారు మరియు పర్సనల్ మేనేజర్ లు మోసం చేయడంతో ఆర్దీక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

 

 

ఆతరువాత గోలీమార్ సినిమాతో తన సక్సెస్ ను మళ్లీ  ప్రారంభించాడు. అటుతరువాత ఇద్దరమ్మాయిలతో , హార్ట్ ఎటాక్ వంటి చిత్రాలను చేసి అప్పులను తీర్చేశాడు, ఆర్దీకంగా స్థిరపడ్డాడు ..ఆ తరువాత పూరిజగన్నాథ్ తీసిన లోఫర్ ,అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాలు నిరాశ పరచాయి తరువాత పుంజుకుని ఇస్మార్ట్ శంకర్ కథతో సక్సెస్ ను సాధించాడు. ఇలా ఇండ్రస్ట్రీ లో ఒడిదుడుకులతో సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పూరిగారు...రాబోయే డైరెక్టర్స్ కి ఆదర్శవంతం  

 

మరింత సమాచారం తెలుసుకోండి: