ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల‌తో వ‌రుస పెట్టి న‌టించిన ఆ హీరోయిన్ త‌న డ్యాన్సుల‌తో అద‌ర గొడుతూ.. త‌న కొంటు లుక్స్‌తో క‌వ్వించేది. వెండితెర‌పై ఆమె కొంటె వేషాల‌కు తెలుగు సినిమా కుర్ర‌కారుకి మ‌తిపోయేది. హైదరాబాదీ మూలాలున్న ఈ అమ్మడు అటు ముంబై పరిశ్రమలోనూ పెద్ద స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది. కెరీర్ ప‌రంగా పీక్స్‌లో ఉండ‌గానే టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమ‌లో ప‌డి ఆ హీరోను చాలా ఘాడంగా ప్రేమించింది. 

 

ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటారు అనేంత వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌ర్వాత ఆ స్టార్‌ హీరోతో ఎఫైర్ వార్తలు తన కెరీర్ ని నిండా ముంచాయన్న ఆవేదనను సదరు నాయిక పదే పదే మీడియా ముఖంగానే వెల్లడించేది. క‌ట్ చేస్తే ఇప్పుడు ఆమె మ‌రోసారి ఆ హీరోతో ఎఫైర్ మ్యాట‌ర్‌పై స్పందించింది. తాను త‌మిళ్ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈ రూమ‌ర్లే అని వాపోయింది. ఇక ఆ హీరోయిన్‌తో ఎఫైర్ అన్న ప్రచారం సాగడంతో ఆ స్టార్ హీరో కూడా తనకు దూరమైపోయాడు.

 

ఇక ఇప్పుడు పెళ్ల‌య్యి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక కూడా స‌ద‌రు సీనియ‌ర్ హీరోయిన్ పాత విష‌యాలు ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేయ‌డంతో సదరు స్టార్ హీరో ఫ్యాన్స్  ఆమెపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలే మనోడికి కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఇలాంటప్పడు ఇలా మీడియా ముందుకొచ్చి పాత విషయాలు కెలకడం సరైనదేనా? అని హీరో గారి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: