లాక్ డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీలు అన్ని కూడా మూతపడ్డాయి. సినిమా ప్రముఖులు అంతాకూడా ఇంట్లోనే లాక్ అయిపోయారు. లాక్ డౌన్ సమయంలో హీరోలు మరియు హీరోయిన్స్ అందరూ పాలుపోక ఎదో ఒక పని చేస్తూనే ఉన్నారు. కొంతమంది వంటలు చేస్తే ఇంకొంత మంది గార్డెనింగ్ వంటి పనులుచేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇంటిపట్టునే ఉంటూ ఏదోవిధంగా కష్టపడుతూ సంతోషిస్తున్నారు. మరియు అభిమానులకు బోలెడంత ఫన్ క్రియేట్ చేసి పెడుతున్నారు. 

మన చేపకల్ల చిన్నది ప్రణీత సుభాష్ మటుకు తనకు తానుగా ప్రేమలో  పడ్డానంటోంది. ఎందుకంటె లాక్ డౌన్ కారణంగా తనను తానూ అద్దం లో చూసుకొని మురిసిపోతూ తన సొంత హృదయంలో తాను లవ్ లో పడిపోతున్నా..అంటూ తన ట్విట్టర్ కథలో పోస్ట్ చేసింది . ఈ అనుభూతి చాల గొప్పదని చెప్పి పాటలతో మైమరచిపోయింది మన పాల వన్నెల చిన్నది ..

మరింత సమాచారం తెలుసుకోండి: