అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడిగా రాజమౌళి పేరు దేశంలో మోగిపోతోంది. బాహుబలితో సృష్టించిన మాయాజాలం అటువంటిది. ఇంతటి టాలెంటెడ్ దర్శకుడికి మరో దర్శకుడి టాలెంట్ నచ్చడమంటే సామాన్యమైన విషయం కాదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘మీకు నచ్చే దర్శకుడు ఎవరు’ అని ఎదురైన ప్రశ్నకు ‘సుకుమార్’ అని చెప్పాడు. సుకుమార్ పనితనం నచ్చడానికి రాజమౌళి కొన్ని అంశాలను గతంలో చెప్పుకొచ్చాడు.

IHG

 

ఆర్య2లో.. ‘ఉప్పెనంత ఈ ప్రేమకు..’ పాట ప్రారంభంలో బన్నీ కొంతమందితో ఫైట్ చేస్తూంటాడు. కానీ వాళ్లలో ఒకరి దగ్గర కాజల్ ఫొటో చూడగానే కొట్టడం మానేసి చిరునవ్వు నవ్వేస్తాడు. వెంటనే పాట థీమ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే బన్నీ వాళ్లని కొట్టడం.. స్లో మోషన్ లో వాళ్లంతా గాల్లోకి ఎగరడంతో పాట స్పీడ్ అందుకుంటుంది. ఇక్కడ సుకుమార్ టేకింగ్ తనకెంతో నచ్చిందని.. సేమ్ థియరీని తన మర్యాదరామన్న సినిమాలో ఉపయోగించానని రాజమౌళి చెప్పుకొచ్చాడు.. ‘నా కర్మ కాలిపోయింది..’ పాట స్లోగా స్టార్ట్ అవుతూ ‘కాలిపోయింది’ అనే పదం రాగానే కార్లు, లారీలు ఒకదానికొకటి ఢీకొని గాల్లోకి ఎగిరిపోతాయి.

IHG

 

ఈ రెండు సినిమాల్లోని ఈ పాటలను చూస్తే సేమ్ టెక్నిక్ కనిపిస్తుంది. చూసేందుకు అందంగా ఉంటాయి. జగడం సినిమాలో కూడా విలన్ గ్యాంగ్ ను చూసి హీరో గ్యాంగ్ అంతా వెనకడుగు వేస్తుంటే వాళ్లలో ఉన్న హీరో రామ్ ఒక్కడే ముందడుగు వేసే సీన్ కూడా సుకుమార్ టెక్నిక్ ను స్పెషల్ గా చూపిస్తుందంటాడు రాజమౌళి. ఆ సీన్ పవన్ కల్యాణ్ కు పడుంటే సినిమా రేంజ్ పెరిగిపోతుంది కూడా అని అన్నాడు. ఇటువంటి క్రియేటివిటీ థాట్స్ తో సుకుమార్ టాలీవుడ్ లో స్పెషల్ గా నిలిచాడు. ఓ దర్శకుడిలోని ప్రతిభను మరో అగ్ర దర్శకుడు గుర్తించడం విశేషమే.

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: