స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందాన నటిస్తుందని తెలుస్తుంది. అయితే సినిమాలో ఆమె కాకుండా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ తో పాటుగా మరో భామకు అవకాశం ఉందట. 

 

ఆ ఛాన్స్ మరో మళయాళ భామ నివేదా థామస్ కు దక్కనుందని అంటున్నారు. టాలెంట్ హీరోయిన్ నివేదా థామస్ యువ హీరోల సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా చేసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ యువ హీరోల సరసన నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో లక్కీ ఛాన్స్ పట్టేసింది. 

 

అయితే సరైన సినిమా పడితే తన టాలెంట్ చూపించాలని అనుకుంటున్న నివేదా థామస్ కు రష్మికకు సమానమైన పాత్ర పుష్ప సినిమాలో చేస్తుందని తెలుస్తుంది. ఎలాగూ ఈ మూవీ ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారని ఎనౌన్స్ చేశారు. సో అసలైన పోటీ రష్మిక వర్సెస్ నివేదా అని చెప్పొచ్చు. కన్నడ భామ రష్మిక తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉండగా ఆమెతో పాటుగా న్యాచురల్ నటనతో ఆకట్టుకుంటున్న నివేదా థామస్ కూడా ఈ సినిమాలో క్రేజీ రోల్ చేస్తుంది. కంటెంట్ మాత్రమే కాదు కాలిక్యులేషన్ విషయంలో కూడా లెక్క సరి చూసుకునే సుకుమార్ ఈ పుష్ప సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.           

మరింత సమాచారం తెలుసుకోండి: