బాహుబలితో భారతదేశ సినీ పరిశ్రమ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న దర్శక దిగ్గజం రాజమౌళి ఒకవైపు.. కబీర్ సింగ్ మూవీతో తన ప్రతిభను బాలీవుడ్ లో చాటిన దర్శకుడు సందీప్ రెడ్డి మరోవైపు. వీరిద్దరిలో ఒక దర్శకుడు విసిరిన ఛాలెంజ్ కు మరో దర్శకుడు పాటిస్తాను అంటే ఎలా ఉంటుంది. ఈ ఇద్దరి తెలుగు దర్శకుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘బీ ద రియల్ మ్యాన్’ హ్యాష్ ట్యాగ్ న కూడా యాడ్ చేసాడు సందీప్.

 

 

‘ప్రతి మనిషికి ఇంటి పని వచ్చి ఉంటుంది. నిజమైన పనిమంతుడు తన భార్యతోనే అన్ని ఇంటి పనులు చేయించడు. ముఖ్యంగా ఇటువంటి క్వారంటైన్ సమయాల్లో అసలు ఆమె చేత పని చేయించడు. ప్రతి ఒక్కరు ఇంటి పనిలో భాగస్వాములు కండి. రాజమౌళి గారూ.. మీరు ఇలా మీ ఇంట్లో ఇంటిపని చేసి ప్రత ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చేసిన ఇంటి పనిని వీడియో తీసి పోస్ట్ చేసి అందరిలో స్ఫూర్తి నింపండి’ అని సందీప్ ఓ పోస్ట్ పెట్టాడు.

 

 

ఈ పోస్ట్ తో పాటు వంటింట్లో తాను అంట్లు తోముతూ, ఇల్లు క్లీన్ చేస్తూ, అద్దాలు తుడుస్తూ ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి తన అర్జున్ రెడ్డి సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఉపయోగించి బూస్టప్ ఇచ్చాడు. దీనికి వెంటనే రాజమౌళి నుంచి స్పందన వచ్చింది. ‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సందీప్.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పనిలో భాగస్వాములు కావాలి. నా వీడియో రేపు పోస్ట్ చేస్తాను’ అంటూ రాజమౌళి రిప్లై ఇచ్చాడు. ఇంటిపనుల్లో భాగస్వామ్యం కావడం అనే వీరిద్దరి టాస్క్ కు మంచి స్పందన వస్తోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: