ఓకప్పుడు హాలీవుడ్ లో యాక్షన్ హీరో అంటే వెంటనే గుర్తుకు వస్తాడు.. రాంబో అదేనండీ సిల్వెస్టర్ స్టాలోన్.  ఈ మూవీ సీక్వెల్ అప్పట్లో వెండితెరపై దుమ్మురేపాయి.  బాలీవుడ్ ఇప్పుడు రాంబోని గుర్తు చేస్తున్నాడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్.   బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.  తాజాగా వార్ సినిమాలో టైగ‌ర్ ష్రాప్ యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.

 

బాఘీ 3 చిత్రంలో కూడా స్టన్నింగ్ గా అనిపించే ప‌తాక స‌న్నివేశాలున్నాయి.  ఈ మూవీలో ఈ యంగ్ హీరో ఓ పెద్ద సాహసం చేశాడు.. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  మైన‌స్ 7 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో..చుట్టూ గ‌డ్డీ, బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద లైట్లు, భీక‌ర‌మైన శ‌బ్దాల మ‌ధ్య‌ చొక్కా లేకుండా భారీ గ‌న్స్ ను చేతుల్లో ప‌ట్టుకుని యాక్ష‌న్ సీన్ నటించాడు. 

 

ఈ సీన్లు సినిమాలో చాలా హైలెట్ గా నిలిచాయి.  తాజాగా  ఈ వీడియోను  టైగ‌ర్ ష్రాప్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు.  ఇలాంటి రియల్ సన్నివేశాలు చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలని.. ఈ కుర్ర హీరోకు తెగ ఫిదా అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: