తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిన విషయమే. ఇండియా మొత్తం ఆయన సినిమాలకు క్రేజ్ ఉంటుంది. రజినీ సినిమా వస్తుందంటే అభిమానుల ఆశలకు రెక్కలు వచ్చేస్తాయి. అదే.. రజినీ సినిమా రికార్డులు క్రియేట్ చేసిందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ ఏడాది సంక్రాంతికి రిలజ్ అయిన దర్బార్ మూవీ మంచి అంచనాలతో విడుదలైంది. సినిమా ఆశించినంతగా ఆడలేదు. కానీ.. ఇప్పుడు టీవీ ప్రీమియర్లలో మాత్రం రజినీ స్టామినాను ప్రూవ్ చేసింది.

 

 

దర్బార్ హిందీ డబ్బింగ్ మూవీని నార్త్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్నారు. స్టార్ గోల్డ్ ఇండియా చానెల్ లో ఈ నెల 5న ఈ సినిమా టెలికాస్ట్ అయింది. ఈ ప్రీమియర్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ వచ్చిందని రజినీకాంత్ ఫ్యాన్స్ తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అత్యధిక టీఆర్పీ సాధించిన దక్షిణాది భాషా సినిమాల్లో దర్బార్ 5వ స్థానంలో నిలిచింది. తమిళ మూవీస్ లో 2వ స్థానంలో నిలిచింది. దర్బార్ సాధించిన ఈ రికార్డును బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా తెలిపింది. బార్క్ ఇండియా డాటా పేరుతో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ రికార్డులను ప్రకటిస్తూ ఉంటుంది.

IHG

 

ఈ ఏడాదిలో 14వ వారంలో టెలికాస్ట్ అయిన దర్బార్ అర్బన్, రూరల్ లో కలిపి రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ దశలో టెలికాస్ట్ అయిన దర్బార్ కు మంచి రేటింగ్స్ వచ్చాయి. మురుగదాస్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ముంబయ్ నేపథ్యంలోనే ఉంటుంది. రూరల్ లో 3780 ఇంప్రెషన్స్ సాధించిందని బార్క్ ఇండియా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ న్యూస్ తో రజినీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: