ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో సినీ నటీనటులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారి కుటుంబ సభ్యులతో ఈ లాక్ డౌన్ సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు. దీనితో పాటు కొందరు నటీనటులు వారిలో ఉన్న సరికొత్త టాలెంట్ ను బయటకు తీస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే  మంచు మనోజ్ ఒక పాట పాడారు. కరోనా వైరస్ అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి అంకితం చేస్తూ మంచు మనోజ్ తన పాటను విడుదల చేయడం జరిగింది.

 

ఈ పాటలో మనోజ్ తో పాటు మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వహణ కూడా గళం కలిపింది. " గుండె బెదిరి పోకు రా గూడు వదల నాకు రా " అంటూ ఈ పాట ఆరు నిమిషాల 11 సెకన్లు ఉంది. ఈ సినిమా ఈ పాటకు అచు రాజమణి సంగీతం అందించారు. ఇక కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ రాయడం జరిగింది. అయితే ఈ పాట పై స్పందిస్తూ... మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని చీకటి ఇలాగే ఉండి పోదని మళ్లీ వెలుగు వస్తుందని గొప్ప ఆత్మస్థైర్యం ఇచ్చే గీతం అంటూ మంత్రి తెలియజేశారు.


ఇది ఇలా ఉండగా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న " అహం బ్రహ్మాస్మి" సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల కిందటే అహం బ్రహ్మాస్మి ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ మంచు మనోజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మాత్రం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది అన్న విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: