తెలుగు సినిమా పరిశ్రమలోని లెజెండరీ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ, తొలుత తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ అందుకుని ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని ముందుకు సాగిన కృష్ణ, వాటిని మంచి సక్సెస్ లు గా మలచుకోవడంలో సఫలం అయ్యారు. ఇక తన కెరీర్ లో దాదాపుగా అన్ని జానర్లలో కూడా సినిమాలు చేసిన కృష్ణ, 1969వ సంవత్సరం లో తొలిసారిగా శభాష్ సత్యం అనే సైఫై సినిమాలో నటించి మంచి సక్సెస్ ని అందుకున్నారు. 

IHG

వాస్తవానికి 2000వ సంవత్సరం హాలీవుడ్ లో రిలీజ్ అయిన హాలో మ్యాన్ తరహా సైన్స్ ఫిక్షన్ కథని 1969 లోనే శభాష్ సత్యం ద్వారా చేసి చూపించారు కృష్ణ. సైఫై కథాంశంతో ఆకట్టుకునే కథ, కథనాలతో ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాని దర్శకుడు జి.విశ్వనాథం తెరకెక్కించడం జరిగింది. కాగా ఈ కథను ర‌చ‌యిత ఆత్రేయ ఎంతో ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్ధి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ప్రాత్న ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఎండీ నాజీం నిర్మించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని కృష్ణ సహా ఇతర నటీనటులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. 

IHG

కృష్ణ సరసన రాజశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, నాగభూషణం, విజయలలిత, ఛాయాదేవి, రాజబాబు, ప్రభాకరరెడ్డి త‌దిత‌రులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. తన అద్భుతమైన సంగీతంతో ఈ సైంటిఫిక్ మూవీని మరో స్థాయికి తీసుకుని వెళ్ళారు అప్పటి ప్రఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు విజయా కృష్ణమూర్తి. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, కృష్ణ నటించిన జానపద చిత్రం ‘మహాబలుడు’ విడుదలైన తరువాతి రోజునే ఈ సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ శభాష్ సత్యం కూడా విడుదల కావడం, అలానే రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కొట్టి కృష్ణకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడం జరిగింది. కాగా శభాష్ సత్యం సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 51 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో కృష్ణ అభిమానులు ఆయనతో పాటు సినిమా యూనిట్ కి పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: