తెలుగు ప్రేక్షకులను తన అందంతో మెప్పించిన నటి కియారా. తెలుగులో ఇప్పటివరకు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామా సినిమాలలో తన నటన మరియు అందం తో మెప్పించింది. అయితే బాలీవుడ్‌లో ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్‌లతో యమా బిజీగా ఉంది. టాలీవుడ్ లో ఈమెకు పెద్ద సినిమాల్లో చేసే అవకాశాలే వచ్చాయి.

 

కానీ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసింది కాబట్టి ఈమెను నిర్మాతలు లైట్ తీసుకున్నారు. కానీ ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో ఈ ప్రశ్ననే అడుగా కథ నచ్చితే తప్పకుండా చేస్తాను అంతేకాని నాకు పారితోషకం గురుంచి ఎటువంటి నిభందనలు లేవు అని తేల్చి చెప్పింది.లాక్ డౌన్ కారణంగా ఇంట్లో లాక్ అయిపోయిన ఈ అమ్మడు తన ఫిట్ నెస్  కోసం మాత్రం తెగ కష్టపడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: