టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా వెలుగొంది.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్‌. చిన్న సినిమాల హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇటీవల తెలుగులో కాస్త స్లో అయినా తమిళ, హిందీ సినిమాలతో దూసుకుపోతోంది రకుల్‌. కన్నడ సినిమా గిల్లితో వెండితెరకు పరిచయం అయిన రకుల్, తరువాత కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2009లో వెండితెరకు పరిచయం అయిన రకుల్ బ్రేక్‌ కోసం 2013 వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో రకుల్‌ ఖాతాలో తొలి సక్సెస్‌ పడింది.

 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మోస్ట్ లక్కీ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. నాగార్జునతో నటించిన 'మన్మధుడు 2' నిరాశను కలిగించింది. తెలుగులో ఛాన్స్ లు లేకపోవడంతో తమిళంలో బిజీ అయ్యేందుకు ప్రయత్నించింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాలు ఛాన్స్ లు వచ్చినా కూడా నిరాశే మిగిలింది. దాంతో బాలీవుడ్ లో తన అందాల ఆరబోతతో బిజీ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తుంది.

 

అయితే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను రకుల్ అక్షరాలా పాటిస్తుందన్న విషయం ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే తన సంపాదనను చాలా వరకు వ్యాపారంలోనే ఇన్వెస్ట్ చేసింది. స్టార్ హీరోలు కూడా చేయలేని ధైర్యం ఆమె చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. F - 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది. ఓ వైపు జిమ్.. మరోవైపు జిమ్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది రకుల్. జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్‌లోనే లేరు అనిపించుకుంది. ఈ జిమ్ వ్యాపారాన్ని ఆమె బ్రదర్ చూసుకుంటున్నాడు. దాంతో ఆఫర్స్  వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేస్తోంది రకుల్. 

 

IHG

 

అయితే ఈ మధ్య ఒక సందర్భంలో రకుల్ సినిమాలు, ఫుడ్, ఫిట్నెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటానని చెప్పిందట. అంతేకాకుండా ఇప్పటికే సినిమాలు, జిమ్ లతో బిజీగా ఉన్న రకుల్ త్వరల్ ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోందట. మంచి ఫుడ్ తింటే మనం హ్యాపీగా ఉండటంతో పాటు హెల్తీగా కూడా ఉంటారని.. అందుకే తన ఫ్రెండ్స్ కి డైట్ సజెస్ట్ చేస్తూ ఉంటానని రకుల్ చెప్పుకొచ్చిందట. సో రాబోయే రోజుల్లో మనం రకుల్ ని డిఫరెంట్ రోల్ లో చూడబోతున్నామన్నమాట. ఏది ఏమైనా రకుల్ అటు సినీ రంగంలో రాణిస్తూనే ఇలా వ్యాపార రంగంలో కూడా తన ప్రత్యేకతను చాటుకోవటాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: