కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. భారత్ లో తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయంపై ఎన్నో దేశాలు హర్షం వ్యక్తం చేశాయి కూడా. దీంతో భారత్ చేస్తున్న పోరుకు స్విట్జర్ లాండ్ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్ లాండ్ – ఇటలీ దేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రఖ్యాత ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లోని మేటర్ హార్న్ పర్వతంపై భారత జాతీయ జెండా వెలుగులను ప్రదర్శించింది. అక్కడ పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ పర్వతం ఎంతో ప్రముఖమైనది.

 

 

దాదాపు 4,478 మీటర్లు ఎత్తున్న ఈ పర్వతంపై కొద్దిసేపు భారత జాతీయ పతాకం వెలుగులు ప్రదర్శించడం భారత్ కు గర్వకారణంగా నిలిచింది. స్విట్జర్లాండ్ దేశం భారత్ కు ఇచ్చిన గౌరవంపై టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ‘కోవిడ్ 19పై భారత్ చేస్తున్న అవిరళ పోరుకు సంఘీభావం తెలిపినందుకు స్విట్జర్లాండ్ కు కృతజ్ఞతలు. మేటర్ హార్న్ పర్వతంపై త్రివర్ణ పతాకం రంగులు వెలుగుతాయని ఊహించలేదు. ఈ చర్య మనసును కదిలిస్తోంది. మీ ప్రేమకు కృతజ్ఞతలు. స్థానిక టూరిజం సంస్థ జెర్మాట్ కు కూడా కృతజ్ఞతలు’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. స్విట్జర్లాండ్ తీరుకు భారత్ కూడా సంతోషం వ్యక్తం చేసింది.

 

 

బన్నీ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బన్నీ నటించిన నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలోని ఫోటోలతో సెల్యూట్ బన్నీ, జైహింద్, లవ్ యూ బన్నీ, జై హింద్.. అంటూ నెటిజన్లు రిప్లైలు, కామెంట్లు చేశారు. సినిమాల పరంగా బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన బన్నీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: