టాలీవుడ్ సినిమా పరిశ్రమకు డాషింగ్ డైరెక్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్, ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. నేటితో ఆయన తొలి సినిమా బద్రి రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు పవన్ కళ్యాణ్ కు, పూరి జగన్నాథ్ కు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. పవన్ సరసన రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అప్పట్లో రమణ గోగుల అందించిన మ్యూజిక్ కి శ్రోతల నుండి ఎంతో గొప్ప రెస్పాన్స్ లభించడం జరిగింది. హీరో పవన్ కళ్యాణ్ పాత్రని సరిగ్గా అదేవిధమైన పవర్ తో ఢీకొట్టే పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కనిపిస్తారు. 

 

సినిమాలో పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. బద్రి తరువాత నుండి వరుసగా అవకాశాలు అందుకుని, మధ్యలో కొన్ని హిట్స్, మరికొన్ని ఫ్లాప్స్ తో ముందుకు సాగిన పూరి కెరీర్, సరిగ్గా 2006లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరితో ఎవరూ ఊహించని గొప్ప రేంజ్ కి వెళ్లిపోయింది. అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా గొప్ప సంచలన రికార్డు ని నమోదు చేసింది. ఇక ఆ సినిమా తరువాత అటు దర్శకుడిగా పూరి రేంజ్ తో పాటు నటుడిగా సూపర్ స్టార్ మహేష్ కూడా అత్యున్నత శిఖరాలు అందుకున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పూరి మాట్లాడుతూ, తనతో కలిసి పనిచేసిన హీరోలందరితో తనకు మంచి అనుబంధం ఉందని, అలానే ఇంకా తాను దర్శకత్వం వహించాల్సిన హీరోలు కొందరున్నారని, అతి త్వరలో వారితో కూడా సినిమాలు తీస్తానని అన్నారు. 

 

ఇక తన కెరీర్ మొదటి సినిమాగా వచ్చిన బద్రి సినిమా కథను, సినిమా తీయడానికి కొన్నాళ్ల ముందు రాసుకున్నానని, వాస్తవానికి తాను రాసుకున్న తొలి స్క్రిప్ట్ పోకిరి సినిమాదని పూరి అన్నారు. అయితే పోకిరి కథను ప్రక్కన పెట్టి ఒక సినిమా తరువాత మరొక సినిమా ప్రకారం రాసుకున్న కథలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగానని చెప్పిన పూరి, పోకిరి కథ మహేష్ కు చెప్పి ఒప్పించిన తరువాత ఎంతో హ్యాపీగా, ప్రశాంతంగా సినిమా తీశామని, కాగా రిలీజ్ కు ముందే తాను ఆ సినిమాని ఒక వంద సార్లకు పైగానే చూశానని చెప్పిన పూరి, రిలీజ్ తరువాత సినిమా మంచి హిట్ కొడుతుందన్న నమ్మకం గట్టిగా ఉన్నప్పటికీ, రిలీజ్ తరువాత అది ఎవరూ ఊహించలేనంత పెద్ద విజయాన్ని అందుకుంటుందని మాత్రం అనుకోలేదని అన్నారు....... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: