మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో కెరీర్ స్టార్ట్ చేశాడు పవన్ కల్యాణ్. ఖుషి వరకూ ఫ్లాప్ అన్నదే లేకుండా వరుస హిట్లతో పవర్ స్టార్ గా ఎదిగిపోయాడు. పవన్ కు వరుసగా వచ్చిన ఏడు హిట్ సినిమాల్లో బద్రి మూవీ ఆరో సినిమా. స్టైలిష్ లవ్ సబ్జెక్టుకు తన మార్కు మేనరిజమ్స్, పూరి మార్క్ టేకింగ్ తో బద్రి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

IHG's Badri; Exclusive Details

 

2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాటు, హీరోయిన్ రేణు దేశాయ్ కు కూడా ఇదే తొలి సినిమా. తొలిప్రేమతో స్టార్ స్టేటస్, తమ్ముడుతో మాస్ హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నాడు పవన్. వరుస హిట్లతో ఉన్న పవన్ కు మాసివ్ కంటెంట్ లవ్ స్టోరీ బద్రి చెప్పాడు పూరి జగన్నాధ్. క్లాస్ టచ్ ఉన్న సబ్జెక్టుకు పవన్ మాస్ మేనరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యాయి. మెడ మీద చేయి వేసుకునే పవన్ మార్క్ మాస్ మేనరిజమ్ బద్రితోనే మొదలైంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BADRI' target='_blank' title='badri-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>badri</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> stills ...

 

పూరికి తొలి సినిమానే అయినా పవన్ ను స్టైలిష్ గా చూపించడంతో పాటు డైలాగ్ డిక్షన్ కూడా మార్చేశాడు. ‘నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాధ్.. అయితే ఏంటి’ అనే డైలాగ్ అప్పట్లో మోగిపోయింది. రమణ గోగుల సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై టి.త్రివిక్రమరావు ఈ సినిమా నిర్మించారు. విజయవాడ రాజ్ ధియేటర్ లో 150 రోజులు ఆడింది. 45 సెంటర్లలో 100 రోజులు రన్ అయి పవన్ కెరీర్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: