టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా అనేది ఎక్కువగానే ఉంది. ఆమె తో సినిమాలు చేసిన హీరోలు అందరూ కూడా హిట్ కొట్టడం తో ఇప్పుడు పూజ చెప్పిందే వేదం అవుతుంది టాలీవుడ్. ఆమె తో సినిమా చేయడానికి ఎక్కువగా దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఆమె కూడా ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఈ మధ్య ఒక తమిళ అగ్ర దర్శకుడు ఆమెను కలవగా ఆమె మాత్రం భారీగా రేటు చెప్పిందని దీనికి భయపడి సదరు నిర్మాత గారూ ఆమె తో సినిమా చేయడానికి వెనక్కు తగ్గారని అంటున్నారు. 

 

టాలీవుడ్ లో తాను బిజీ గా ఉన్నాను అని ఇప్పుడు తమిళంలో సినిమా చేయడం కష్టం అని కూడా ఆమె చెప్పినట్టు సమాచారం. ఆమెకు తెలుగులో ఆఫర్లు బాగా వస్తున్నాయి అనే మాట అక్షరాలా నిజం. అందుకే ఇప్పుడు బయట సినిమాల్లో చెయ్యాలి అంటే కచ్చితంగా భారీగా డిమాండ్ చెయ్యాలి అని ఆమె భావిస్తుంది. అలా అయితేనే అక్కడ సినిమాలు చెయ్యాలి అని లేకపోతే అవసరం లేదని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. మన తెలుగు హీరోలు కూడా ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం తో ఇతర భాషల హీరోలు ఎంత పెద్ద స్టార్ అయినా సరే... 

 

ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. తమిళ సినిమాలో ఆమె ఏకంగా రెండు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ కూడా చేసింది అనే మాట ఎక్కువగా వినపడుతుంది. ఆమె తో సినిమా చేయడానికి అక్కడ ఆసక్తి చూపించడమే దీనికి కారణమని అంటున్నారు. ఇక్కడ ఆమెకు మార్కెట్ భారీగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని ఆమె నటించిన సినిమా ఇక్కడ విడుదల చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: