లాక్‌ డౌన్‌ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ అంతా తమ ఫిట్‌ నెస్ మీద దృష్టి పెట్టారు. ప్రతీ ఒక్కరు తమ వర్క్‌ అవుట్ వీడియోస్‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల్లో మరింత జోష్‌ పెంచుతున్నారు. `లోఫర్‌` బ్యూటీ దిశ పటాని కూడా ఇదే బాటలో నడుస్తోంది. వరుసగా తన హాట్ ఫోటోలతో పాటు వర్క్‌ అవుట్ అప్‌డేట్స్‌ను కూడా ఇస్తూ అభిమానులను అలరిస్తోంది.

 

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్‌ కోసం తను ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ డ్యాన్స్‌ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. బెయాన్స్‌ రూపొందించిన యోన్స్‌ అనే ట్రాక్‌కు కిల్లర్ డ్యాన్స్‌ మూవ్స్‌ చేస్తూ అదరగొట్టింది దిశా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిప్‌ హాప్‌ స్టైల్‌లో దిశ చేసిన ఈ బ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు సెలబ్రిటీల నుంచి కూడా లైక్‌లు కామెంట్‌లు వస్తున్నాయి.

 

ఇటీవల బాగీ 3 సినిమాలో డూ యూ లవ్‌ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది ఈ బ్యూటీ. చివరగా అనిల్ కపూర్‌, ఆదిత్య రాయ్ కపూర్‌ నటించిన మలంగ్ సినిమాలో కనిపించిన దిశా, ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాధే సినిమాలో నటిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#beyonce❤️ Choreography #brian🌸 #quarantinelife❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

మరింత సమాచారం తెలుసుకోండి: