చిత్రపరిశ్రమలో హీరోయిన్ల పరిస్దితి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విధంగా ఉంటుంది.. అన్ని ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి.. లేకుంటే యవ్వనం ఐస్‌లా కరిగిపోయాక బాధపడి లాభం ఉండదు.. ఇలా ముందు జాగ్రత్తపడిన కొందరు హీరోయిన్స్ ఫైనాన్సియల్ గా స్దిరపడగా, మరికొందరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. ఇప్పటికి హీరోయిన్‌గా అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు.. మరికొందరైతే ఎక్కడ అభిమానులు తమను మరచిపోతారో అనే భయంతో సోషల్ మీడియాలో తమ అందాలు ఆరబోస్తూ.. హాట్ పిక్స్‌తో అందరికి టచ్‌లో ఉన్నారు..

 

 

ఇకపోతే ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి గత కొంత కాలంగా అడ్రస్ లేకుండా పోయిన ఓ సీనియర్ నటికి సరైన అవకాశాలు రాక తాను ఎలాంటి పాత్ర చేయడానికైన సిద్దమంటు చాలా సార్లు పేర్కొన్నది.. కనీసం ఇలాగైనా సినిమా అవకాశాలు వస్తాయనే ఆశతో.. కానీ ఇండస్ట్రీ అంతలా పట్టించుకోలేదు.. ఆ తర్వాత పెళ్లిచేసుకుని భర్తతో కలిసి స్పెయిన్ లో ఉంటుంది.. ఇప్పటికే అర్ధం అయ్యిందనుకుంటా ఆ నటి ఎవరో.. కాలేదా అయితే వినండి.. ఆవిడే శ్రియా సరన్.. ఈ హీరోయిన్‌కు పెళ్లి అయినప్పటి నుండి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో అవకాశాలు సన్నగిల్లాయి..ఈ దశలో తనను అభిమానులు ఎక్కడ మరిచిపోతారో అని వారి కోసం అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫొటోస్.. ఇంకా వల్గర్ టాక్స్ తో  వార్తల్లో నిలుస్తోంది..

 

 

అయితే ఇటీవల శ్రియ తన భర్తకు కరోనా లక్షణాలున్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే.. వాస్తవానికి స్పెయిన్ లో కరోనా మరణాలు చాలా ఎక్కువే. కరోనా లక్షణాలుంటే కచ్చితంగా 14 నుంచి 20 రోజుల వరకూ క్వారంటైన్ లో ఉండాలి.. కానీ శ్రియ, ఆండ్రీ ఇద్దరూ ఆస్పత్రికెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాక తిరిగి ఇంటికెళ్లినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా సరసాలడటం.. మూతులు నాక్కోవడం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రీ బర్త్ డే నాడు ఎవరో ఒక నెటిజన్ ఏదో పిచ్చి పిచ్చిగా వాగటం.. అది మళ్లీ చదివి మరీ భర్తకు వినిపించడం.. ఆ నెటిజన్  కు ఆండ్రీ మద్దతిస్తూ సూపర్బ్ అని చెప్పి.. ఇంకా కామెంట్ చేయండి అని చెప్పడంతో సమాజాన్ని చెడగొడుతున్నారంటు కొందరు గుర్రుగా ఉన్నారట..

 

 

వాడెవడికో సిగ్గూ శరం వగైరా లేకుండా మాట్లాడాడు అనుకుంటే, సెలబ్రిటీ హోదాలో ఉండి శ్రియా మరీ ఇంతలా దిగజారి వ్యవహరించాలా.. అంటూ నెటిజన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయ్. పోనీ ఇలాంటి చేష్టలతో తమరికేమైనా సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటే అదీ లేదు.. మహా అంటే వార్తల్లో నిలుస్తారే తప్ప అస్సలు కుదరని పని. అందుకే అవకాశాలు రాకపోయినా ఎవరి లిమిట్స్ లో వారుంటే.. ఎదుటి వ్యక్తి కూడా  గౌరవమిచ్చి మాట్లాడతాడనే విషయం శ్రియా తెలుసుకుంటే మంచిదని క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు... ఈ విషయంలో కొందరు హీరోయిన్స్ అయితే.. మా పర్సనల్ లైఫ్ మాది.. మీరెవరు నిర్ణయించడానికి అని విమర్శలు కూడా చెసారు.. కానీ పర్సనల్ లైఫ్‌ను పదిమందిలో పెట్టుకుని పరువు తీసుకోకూడదు కదా అనేవారు కూడా లేకపోలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: