లాక్ డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఆన్‌లైన్‌లో చూసే సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ సినిమాలు చూడాలి. అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అలాంటి వారి కోసం మేం ఇస్తున్న బెస్ట్ ఆప్షన్ లిస్ట్ ఇదే.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చూడాల్సిన సినిమా ఫస్ట్ బ్లడ్‌. 1982లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ యాక్షన్‌ ఫిలిం అప్పట్లో సంచలనం సృష్టించింది. హాలీవుడ్ తో పెద్దగా పరిచయం లేని ఇండియన్ రీజినల్‌ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా కూడా చర్చ జరిగిందంటేనే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్‌ అయ్యిందో చెప్పొచ్చు. సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన ఈ సినిమాకు టెడ్‌ కొచ్చెఫ్ దర్శకుడు.

 

యాక్షన్‌ ప్రియులను అలరించే మరో సినిమా కిల్ బిల్ 2. ఈ సినిమా సెకండ్‌ హాఫ్‌ అంతా ఎక్కువగా డైలాగ్ డ్రామాలా అనిపించినా.. ఫస్ట్ హాఫ్ అంతా ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌తో అదరగొడుతుంది. ముఖ్యంగా 88మందితో చేసే ఫైట్ సీన్స్‌ సూపర్బ్‌.

 

ఈ లిస్ట్ లో మరో సినిమా ది రైడ్‌ 2. ది రైడ్ తొలి భాగం ఆ స్థాయిలో ఆకట్టుకోకపోయినా రెండో భాగం మాత్రం అదరగొట్టింది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌తో పాటు కార్‌ చేజ్‌ సీన్స్‌ సూపర్బ్ అనిపిస్తాయి.

 

అదరగొట్టే మరో యాక్షన్ సినిమా మిషన్‌ ఇంపాజిబుల్. 2015లో రిలీజ్ అయిన ఈ టాక్ క్రూజ్‌ మూవీ అప్పట్లో యాక్షన్ లవర్స్‌న ఉర్రూతలూగించింది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌తోనే ఆడియన్స్‌ను యాక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతారు చిత్రయూనిట్‌.

 

లాస్ట్ బట్‌ నాట్ ద లీస్ట్ అనిపించే యాక్షన్ మూవీ జాన్‌ విక్‌. ఫ్రొఫెషనల్ కిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్‌ ప్రియులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని ప్రతీ విలన్‌ను హెడ్‌ షాట్‌తోనే చంపటం అనేది ఎవరికైనా వావ్‌ అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: