కరోనా సమస్యతో షూటింగ్ లు ఆగిపోవడంతో కనీస అవసరాలకు కూడ నోచుకోని ఫిలిం ఇండస్ట్రీ కార్మికులను అదేవిధంగా ఇండస్ట్రీలోని చిన్నచిన్న పాత్రలు వేస్తూ తమ జీవితాలను పోషించుకుంటూ జీవించే నటీనటులను ఆదుకోవడానికి చిరంజీవి ‘కరోనా క్రైసిస్ కమిటీ’ ని ఏర్పాటు చేసినప్పుడు కొందరు ఆవిషయాన్ని లైట్ గా తీసుకున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఈకమిటీ వ్యవహారాలను చాల సీరియస్ గా తీసుకుంటూ దీనికోసం తన శక్తిమేరకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితులలో చిరంజీవి వ్యతిరేక వర్గం కూడ మెగా స్టార్ పట్టుదలను చూసి ఆశ్చర్య పోతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారాయి. తాను సిసిసి కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అవసరం అనుకుంటే తానొక మెట్టు దిగి కార్పోరేట్ కంపెనీల వద్దకు వెళ్లి తాను సిసిసి కోసం ఆకంపెనీల యజమానుల సహాయంకోరుతూ సామాన్య వ్యక్తిలా వారి వద్దకు వెళ్ళడానికి కూడ సిద్ధం అంటూ సంకేతాలు ఇచ్చాడు.


అంతేకాదు తనకు వ్యక్తిగతంగా జిఎమ్ఆర్ జివికె మేఘా ఇంజనీరింగ్ సంస్థల అధినేతలతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని వారందరి దగ్గరకు వెళ్ళి సిసిసి కోసం విరాళాలు సేకరించడానికి తాను వెళ్ళి వ్యక్తిగతంగా ఒత్తిడి చేస్తాను అంటూ చిరంజీవి ఇస్తున్న లీకులను బట్టి సిసిసి సంస్థను కరోనా సమస్య తరువాత కూడ కొనసాగిస్తూ ఇండస్ట్రీ పేద కార్మీకుల కోసం సహాయంచేసే ఒకపెద్ద సంస్థగా మార్చే దిశలో చిరంజీవి అడుగులు వేస్తున్నాడు. ఇదే సందర్భంలో చిరంజీవి తన అభిమానులకు కూడ పిలుపు ఇచ్చాడు. 


ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో బ్లడ్ బ్యాంక్స్ అన్నింటిలోను అన్ని గ్రూపులకు సంబంధించిన బ్లడ్ రిజర్వ్స్ తగ్గిపోవడం చాలమందిని కలవర పెడుతోంది. దీనితో అత్యవసర పరిస్థితులలో ఆపరేషన్స్ చేయించుకోవలసిన రోగుల పరిస్థితి ఏమిటి అంటూ ఆందోళన మొదలైంది. ఈసమస్యను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి నిన్న తన బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి రక్తం డొనేట్ చేయడమే కాకుండా తన అభిమానులను అందర్నీ కూడ ఈప్రయత్నంలో పాలుపంచుకోమని పిలుపు ఇవ్వడంతో ఈ లాక్ డౌన్ టైమ్ లో చిరంజీవి ఆలోచనలలో వచ్చిన మార్పులతో పాటు అతడి సామాజిక స్పృహ ఇండస్ట్రీ లీడర్ గా చిరంజీవిని మార్చేస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: