ఒకప్పుడు తెలుగు సినిమా పరిధి చాలా చిన్నగా ఉండేది. క్వాలిటీ బాగానే ఉన్నా మార్కెట్ తక్కువగా ఉండడంతో బాలీవుడ్ జనాలు తెలుగు సినిమాలని ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. కానీ ఒకే ఒక్కడు తెలుగు సినిమా గతినే మార్చివేశాడు. అప్పటి వరకూ ఎవ్వరూ ఊహించినదాన్ని ఊహించి, భారతదేశ సినీ చరిత్రలోనే ఎవ్వరూ చేయని సాహసం చేశాడు. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు.

 

అతడే రాజమౌళి. బాహుబలి సినిమా ఒక కారణం రాజమౌళి అయితే మరో కారణం ప్రభాస్. ఒక హీరో ఒకే సినిమాకి తన ఐదు సంవత్సరాల కాలాన్ని ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. రాజమౌళిపై ఉన్న నమ్మకమే ప్రభాస్ ని నేషనల్ స్టార్ ని చేసింది. ప్రస్తుతం ప్రభాస్ కి ఇండియా లెవెల్ లో ఉన్న ఫాలోయింగ్ ఏ బాలీవుడ్ హీరోకి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం సాహో సినిమాతో క్లియర్ గా అర్థం అయింది.

 

తెలుగు హీరో ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్. ఇక ప్రభాస్ చిత్రాలన్నీ నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంటాయి. అయితే ప్రభాస్ తర్వాత చాలా మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, బన్నీ పుష్ప సినిమాలతో పాన్ ఇండియాని టార్గెట్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత తన తర్వాతి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నానని ప్రకటించాడు.

 

అయితే తెలుసు స్టార్ హీరోలందరూ నేషనల్ వైడ్ పాపులారిటీ కోసం పోటీపడుతున్నారు. మరి వీరందరిలో ఎవరు సక్సెస్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ప్రభాస్ తర్వాత బాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకునేది ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలన్నీ రిలీజ్ అయితే గానీ ఆ అదృష్టం ఎవ్వరిని వరించనుందో తెలియదు. కాకపోతే ప్రతీ ఒక్కరు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: