మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎవరనంటే టక్కున గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ టాప్ హీరోగా కొనసాగారు. ఆయన అభిమానులు రోజు రోజుకీ పెరుగుతూ వెళ్లారు. అయితే అభిమానులు ఎక్కువవుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఫెయిలవుతూ వచ్చాయి. ఒకటి కాదు రెండు వరుసగా ఫ్లాపులు రావడం ఆయన అభిమానులని నిరుత్సాహానికి గురిచేసింది. 

 


పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తుందంటే, ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న ఫ్లాపులని అన్నింటినీ మరిపించేలా చేస్తుందని నమ్మిన ప్రతీసారీ నిరాశే ఎదురయింది. అలాంటి తరుణంలో అభిమానుల ఆకలి తీర్చడానికి వచ్చిన సినిమానే గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులని కాలర్ ఎగరేసుకునేలా చేసింది. పవన్ కళ్యాణ్ కి సరైన సమయంలో కరెక్ట్ సినిమా పడింది.

 

ఒక స్టార్ హీరోకి కావాల్సిన అన్ని అంశాలని అందులో పొందుపర్చాడు హరీష్ శంకర్. స్వతాహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హరీష్, పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే దర్శకుడిలా కాకుండా.. ఒక అభిమాని తన అభిమాన హీరోని తెర మీద ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో చూపించాడు. పేరుకి ఇది రీమేక్ సినిమానే అయినా, ఒరిజినల్ మూవీకీ గబ్బర్ సింగ్ మూవీకి చాలా తేడాలున్నాయి.

 

 

రీమేక్ లని తనదైన శైలిలో తెరకెక్కించే హరీష శంకర్ పవన్ కళ్యాన్ కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి ఎన్ని ఫ్లాపులైనా ఉండవచ్చు. కానీ వాటన్నింటినీ మరిపించిన చిత్రమే గబ్బర్ సింగ్. ఆ సినిమాలో పవన్ మేనరిజం, డైలాగ్స్, కామెడీ టైమింగ్ ఇలా ప్రతీదీ సూపర్ గా వచ్చింది. అందుకే ఈ సినిమా చూసిన అభిమానులకి కడుపు నిండినంతా పనయింది. గబ్బర్ సింగ్ తర్వాత అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: