ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మిస్తున్న పెద్ద సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ జక్కన్న గా పిలుచుకునే రాజమౌళి, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వీరందరి పవర్ ప్యాక్ కలయికతో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం సాగుతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజుగా నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ వేషధారణలో కనిపించబోతున్నారు.

 


వీరికి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా బట్ మరొకరి సరసన హాలీవుడ్ నటి నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా 80 శాతం వరకు పూర్తి అయిందని దర్శకుడు రాజమౌళి తెలిపాడు. ప్రస్తుతం సినిమా అయిన వరకు గ్రాఫిక్ వర్క్ జరుగుతుందని ఆయన తెలుపుక వచ్చాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే... డైరెక్టర్ రాజమౌళి ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చాడు. అదేమిటంటే ఆర్.ఆర్.ఆర్ సినిమా దేశభక్తి కథ కాదంట. హీరోల క్యారెక్టర్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కు సంబంధించి అని ఒక క్లారిటీ దర్శకుడు రాజమౌళి తెలిపాడు. అయితే ఇక ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో అన్ని సినిమాలు నిర్మాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతనే వీటిని చిత్రీకరించడానికి అనువుగా ఉంటుంది.

 


ఏది ఏమైనా ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అటు రామ్ చరణ్ తేజ్ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో "ఆ పోయి రావాలె హస్తినకు" సినిమా చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: