సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఈరోజు ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను తెలియజేశాడు.  ఆర్ ఆర్  ఆర్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి టాక్ నీ సొంతం చేసుకుంది. లాక్ డోన్ కారణంగా సినిమా తారలు అందరూ ఇళ్ల కే పరిమితమయ్యారు. రాజమౌళి గారు ఆర్.ఆర్.ఆర్ సినిమా కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఓ ఛానల్ ద్వారా పంచుకున్నారు. బాహుబలి సమయం లోనే రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి  సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. ఆ  ఆలోచనే ఆర్.ఆర్.ఆర్ చేయడానికి ఉత్సాహాన్ని ఇచ్చింది.

 

అలాంటి ఆలోచన రావడంతో ఏ కథ అయితే   బాగుంటుందో అని ఆలోచించాను. అప్పుడు నాకు రెండు మూడు ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచన ఫలితమే ఆర్ ఆర్ ఆర్. ఇది దేశ భక్తికి సంబంధించిన సినిమా. ఇందులో భాగంగానే ఇల్లు విడిచి బయటకి వెళ్లిన పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు మరియు  కొమరం భీమ్ లు కలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. ఇలా  ఆలోచన రావడంతోనే రామ్ చరణ్ ను మరియు జూనియర్ ఎన్టీఆర్ ను కలసి స్టోరీ లైన్ చెప్పాను.  వారికి కూడా స్టోరీ లైన్ నచ్చడంతో సినిమాను ప్రారంభించాం. స్టోరీ చెప్పిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తారక్ మరియు చరణ్ లకు ఒకరికి తెలియకుండా మరొకరికి  పిలిచి వారిద్దరికీ స్టోరీ లైన్ చెప్పడం జరిగింది.  వారికి ఈ స్టోరీ లైన్ బాగా  నచ్చిందని చెప్పడంతో ఈ సినిమాను ప్రారంభించాం.

మరింత సమాచారం తెలుసుకోండి: