వరుస విజయాలతో దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల నిర్మాతలు రాజమౌళితో ఒక్క సినిమా అయినా నిర్మించాలని.... అన్ని భాషల హీరోలు రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించే అవకాశం వస్తే చాలని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఒక టీవీ ఛానల్ తో ఈ సినిమా విశేషాలను పంచుకున్న రాజమౌళి తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన జక్కన్న తన ఇంటికి ప్రధాన మంత్రి, అధ్యక్షుడు అన్నీ రమా రాజమౌళినే అని చెప్పారు. ఎవరు ఏ పని చేయాలో తన భార్యే డిసైడ్ చేస్తారని అన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం ఇల్లు తుడుస్తున్నానని... తన బట్టలు తానే ఉతుక్కుంటున్నానని రాజమౌళి చెప్పారు. 
 
తనకు వంట రాదని... ఆ పని తప్ప ఇంట్లో తన భార్య ఏ పని చెప్పినా చేస్తానని అన్నారు. వీథిలో పులిలో ఉండే రాజమౌళి ఇంట్లో మాత్రం బార్య మాట విని బుద్ధిగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాను అందరూ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నానని అనుకుంటున్నారని... కానీ ఈ కథ ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతోందని అన్నారు. లాక్ డౌన్ వల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు ఏమీ లేవని చెప్పారు. 
 
మరో రెండు సంవత్సరాల పాటు కరోనా వ్యాప్తి తగ్గినా ఆ ప్రభావం ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు టైటిల్ అనుకోలేదని... ఆర్ఆర్ఆర్ టైటిల్ ను కేవలం వర్కింగ్ టైటిల్ గా మాత్రమే అనుకున్నామని చెప్పారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని... ఎన్టీయార్ పుట్టినరోజుకు మరో టీజర్ ను విడుదల చేస్తామో చేయలేమో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: