ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎలా విజృబూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మన దేశంలోనూ గత 30 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. 

 

ఇంకా ఎంత కాదు అనుకున్న మరో 13 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇళ్లల్లో ఉండే ప్రజలందరికీ పిచ్చి ఎక్కేస్తుంది ... ఈ వైరస్ ఎప్పుడు రా స్వామి తగ్గేది.. లాక్ డౌన్ ఎత్తి వేసేది ఎప్పుడు? బయటకు పక్షులాల ఎగిరేది ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి ఈ సమయంలో ఇంట్లోనే కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు చూసి లవ్ ఫీల్ పొందొచ్చు. 

 

అయితే అలాంటి అద్భుతమైన టాప్ 5 సినిమాలు ఏవి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఈ కొన్ని రోజుల్లో మళ్లీ మళ్లి ఆ సినిమాలో లవ్ ఫీల్ ఆస్వాదిద్దాం.. 

 

టాప్ 5 లవ్ ఫిల్మ్.. అర్జున్ రెడ్డి!

 

విజయ్ దేవర కొండా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేమ అంటే ఇంత పిచ్చిగా ఉంటుందా? అని చూపించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాను ఎన్ని సార్లు చుసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఈ లాక్ డౌన్ లో మంచి సినిమా ఇదే. 

 

టాప్ 4 లవ్ ఫిల్మ్.. ఆరెంజ్!

 

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఓ అద్భుతం.. అబద్దం చెప్తే ప్రేమే కాదు అని.. ప్రేమ అంటే నిజం అని.. నిజాన్ని నిర్భయంగా ఒక మనిషి దగ్గర చెప్పడం ప్రేమ అని.. అలాగే ప్రేమ పెళ్లిళ్లలో ప్రేమ శాశ్వతం కాదు అని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు. 

 

టాప్ 3 లవ్ ఫిల్మ్.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు!

 

శర్వానంద్ హీరోగా.. నిత్య మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓ అద్భుతం.. ఈ సినిమాలో ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎన్ని సార్లు చుసిన తక్కువే.. ప్రేమ ఒక మనిషిపై పుడితే అది చచ్చేవరుకూ పోదు అని.. జన్మ అంత ఆ మనిషిపైనే ప్రేమ ఉంటుంది అని చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాను ఎన్ని సార్లు అయినా చూడచ్చు.. 

 

టాప్ 2 లవ్ ఫిల్మ్.. నిన్ను కోరి!

 

నాని హీరోగా.. నివేద థామస్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎంతోమంది ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ కి ఆదర్శం.. ప్రేమించిన అమ్మాయి మరొకరిని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం నాశనం కాకూడదు అని.. అమ్మాయి పడే తపన.. ప్రేమించిన అమ్మాయి మరొకరితో ఆనందంగా లేదు ఏమో అని బాధ పడే అబ్బాయికి లవ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా ఒక అద్భుతమైన జీవితం ఉంటుంది అని చెప్పిన సినిమానే నిన్ను కోరి. 

 

టాప్ 1 లవ్ ఫిల్మ్.. సఖి!

 

మాధవన్ నటించిన ఈ సినిమా ఎప్పటికి సూపర్ హిట్ ఏ.. ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.. అప్పట్లోనే ఈ సినిమాలో సహజీవనం గురించి చెప్పిన అద్భుతమైన సినిమా ఇదే.. ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది మరి.. 

 

నాకు అయితే ఈ సినిమాలు పిచ్చ పిచ్చగా ఇష్టం.. ఈ సినిమాలు ఎవర్ గ్రీన్.. ఈ సినిమాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి.. ప్రేమికుల రోజు, చెలి, గీతాంజలి, ప్రేమదేశం, సుస్వాగతం, ప్రేమ, రోజా, ప్రేమికుడు, ప్రేమికుల రోజు, తొలి ప్రేమ, మనసంతా నువ్వే, డార్లింగ్, అందాల రాక్షసి ఈ సినిమాలు అన్ని అద్భుతమే.. కాబట్టి ఈ లాక్ డౌన్ లో రోజుకు 3 సినిమాలు చుసిన లాక్ డౌన్ తరవాతకు కూడా ఉంటాయి.. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ సినిమాలు అన్ని చూసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: