సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి  డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ని ఇప్పటికే రాజమౌళి రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు  పాత్రను పోషిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు కూడా వివిధ తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలో నుండి వచ్చినవే. అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ ఇద్దరూ కూడా ప్రజల చైతన్య పోరాట పటిమను పెంచిన వారే. చరిత్రలో అసలు కలవని ఇద్దరు యోధులు అల్లూరి మరియు భీమ్ లు కలిస్తే ఎలా ఉంటుంది.

 

వారిద్దరూ అజ్ఞాతవాసంలో కలసిపోయి సొంత ప్రాంతాలకు వచ్చి విప్లవ వీరులు గా ఎదిగిన వైనాన్ని రాజమౌళి ఓ కల్పిత కధ గా ఆర్.ఆర్.ఆర్ లో చూపించబోతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్  మూవీలో కీలక మలుపు అదే అంటున్నారు .ఈ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. యుక్తవయసులో కి వచ్చిన అల్లూరి మరియు కొమరం భీమ్ లు వారి ప్రాంతాల్లో అన్యాయాలను సహించలేక.. ఏమీ చేయలేక ఇంటి నుంచి పారిపోయి ఉత్తర భారతదేశానికి చేరుకుని అజ్ఞాతంలో ఉంటూ వీరిద్దరూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పాత్రతో కలుస్తారట... వీరిలో  కసి నీ శక్తిగా మార్చే గురువుగా అజయ్ దేవగన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. వీరిద్దరూ అసమాన యుద్ధ  విద్యలు గురువు నుంచి  పొందుతారట.  అజయ్ దేవగన్ ఓ గురువుగా మెప్పించ నున్నాడట ఈ సినిమాలో....

 

మరింత సమాచారం తెలుసుకోండి: